Asianet News TeluguAsianet News Telugu

ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో మహిళల మర్మాంగాలపై ఫైరింగ్.. వైద్యులు ఏమన్నారంటే?

ఇరాన్ హిజాబ్ వ్యతిరేక ఆందోళనలను అణచివేయడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ దారుణమైన మార్గాలు అనుసరించినట్టు ది గార్డియన్ పేర్కొంది. ఆందోళనలు చేస్తున్న మహిళల మర్మాంగాలను టార్గెట్ చేసుకుని బర్డ్ షాట్ పెల్లెట్లను ఫైర్ చేసినట్టు ఆ కథనం వివరించింది.
 

Iran anti hijab women protestors shot in eyes, breasts, thighs
Author
First Published Dec 9, 2022, 4:30 PM IST

న్యూఢిల్లీ: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు చుట్టుముట్టేశాయి. చివరకు మొరాలిటీ పోలీసులను నిషేధిస్తున్నట్టు ఇటీవలే ఓ ప్రకటన వచ్చింది. షరియా విధించిన డ్రెస్ కోడ్‌ను ఉల్లంఘిస్తూ కొందరు మహిళలు ఆందోళన బాటపట్టారు. అందులో మహ్సా అమీని ఒకరు. హిజాబ్ తీసేసి నిరసన వ్యక్తం చేసిన ఆమెను మోరల్ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 16న ఆమె కస్టడీలోనే మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా మహిళలు ఆందోళనలు చేశారు. వీరిని అణచి వేయడానికి సెక్యూరిటీ ఫోర్సెస్ యాక్షన్ తీసుకున్నారు. బర్డ్ షాట్ పెల్లెట్లను ఫైర్ చేశారు. అవి మహిళల శరీర అవయవాలను టార్గెట్ చేసుకుని ఫైర్ చేసినట్టు తెలుస్తున్నది.

మహిళల ముఖాలు, బ్రెస్ట్, జెనిటల్స్ (మర్మాంగాలు), తొడ లోపలి భాగాలను టార్గెట్ చేసుకుని కాల్చినట్టు ఉన్నాయని ది గార్డియన్ రిపోర్ట్ చేసింది. పదుల సంఖ్యలో వ్యక్తుల శరీరాల్లోకి కొద్ది లోతులో చిన్నటి షాట్ బాల్స్ దిగినట్టు కొన్ని చిత్రాల్లో కనిపించాయని అమెరికా మీడియా పేర్కొంది. కాగా, పురుషుల్లో మాత్రం ఈ షాట్ బాల్స్ కాళ్లు, వెనుకభాగం, బటక్స్‌లలో దిగినట్టు తెలిపింది.

Also Read: ఎన్నికల్లో మహిళలకు టికెట్లు ఇవ్వడం కూడా ఇస్లాంకు వ్యతిరేకమే: గుజరాత్‌లో మతపెద్ద వ్యాఖ్యలతో కొత్త వివాదం

‘నేను 20 ఏళ్ల పడిలోని ఓ మహిళ కు చికిత్స అందించాను. ఓ మహిళ జెనిటల్స్‌లో రెండు పెల్లెట్లు దిగిపోయాయి. మరో పది పెల్లెట్లు ఇన్నర్ థై (తొడ)లో దిగాయి. ఇందులో నుంచి పది పెల్లెట్ల ను సులువగా తొలగించగలిగాం. కానీ, రెండు పెల్లెట్లు తొలగించడం మాత్రం చాలెంజింగ్‌గా మారింది. ఎందుకంటే అవి ఆ మహిళ యురెత్రా, వజీనల్ ఓపెనింగ్‌ మధ్యలో చేరాయి’ అని ఓ వైద్యుడు పేర్కొ న్నాడు. మొత్తంగా మహిళలు, పురుషులను డిఫరెంట్‌గా టార్గెట్ చేశారని అర్థం అవుతున్నాయని తెలిపింది.

అల్లర్లను నియంత్రించే విధానాలనూ వారు పాటించలేదని, వ్యక్తుల ముఖ్యమైన శరీర అవయవాలు గాయపడకుండా కాళ్లు, పాదాలను టార్గెట్ చేసుకోలేదని ఆ రిపోర్ట్ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios