కారు వాటర్ వాష్ చేస్తున్న యువతిపై బాటిల్‌తో దాడి: కౌంటరిచ్చిన బాధితురాలు వీడియో వైరల్
కారు వాటర్ వాష్ చేస్తున్న యువతిపై బాటిల్ తో కారులో నుండి ఒకరు దాడికి దిగారు. ఈ ఘటన తర్వాత బాధితురాలు అదేస్థాయిలో దాడికి దిగింది.
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానాలో గల కారు వాషింగ్ సెంటర్ లో కారు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న యువతిపై కారు నుండి ఒకరు బాటిల్ ను విసిరికొట్టారు. అయితే దీనికి అదే స్థాయిలో కారు వాటర్ సర్వీసింగ్ చేస్తున్న యువతి కూడ స్పందించింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియానాలోని కారు వాటర్ సర్వీసింగ్ సెంటర్ లో అన్నా హరికీ అనే 18 ఏళ్ల యువతి పనిచేస్తుంది. అయితే ఆ యువతి ఓ కారు వాటర్ వాషింగ్ చేస్తున్న సమయంలో కారు నుండి ఒకరు ఓ డ్రింక్ ఉన్న బాటిల్ ను విసిరికొట్టారు.ఈ ఘటనతో అన్నా హరికి షాక్ కు గురైంది. వెంటనే తేరుకొని తనపై బాటిల్ ను విసిరికొట్టిన వారిపై వాటర్ పైప్ తో నీటిని కొట్టింది. దీంతో కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కారు అద్దాలు పైకి ఎత్తాల్సిన పరిస్థితి నెలకొంది. కారు వాటర్ వాష్ చేస్తున్న సమయంలో కారు లోపలి నుండి తనపై డ్రింక్ ఉన్న బాటిల్ ను ఎందుకు విసిరారో తెలియదని అన్నా హరికి చెబుతున్నారు.ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. వాటర్ వాషింగ్ యజమానులు కూడ అన్నా హరికికి అండగా నిలిచారు. న్యూయార్క్ పోస్టు కథనం మేరకు ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగింది.
also read:'కాళేశ్వరంలో అవినీతిపై ఆ మూడు నివేదికల ఆధారంగా చర్యలు': అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేతపత్రం
తాను గతంలో కూడ చాలా కార్లను వాటర్ వాష్ చేసిన విషయాన్ని అన్నా హరికి చెప్పారు. కానీ, ఈ కారులో ఉన్న వారే ఎందుకు ఇలా ప్రవర్తించారో తెలియదని ఆమె తెలిపారు. తన పనిలో భాగంగానే కారు వాటర్ వాష్ చేస్తున్న సమయంలోనే నాపై దాడి చేయడంతో షాక్ కు గురైనట్టుగా బాధితురాలు చెప్పారు.
also read:టిక్కెట్లకు ఎసరు:పొత్తులపై తెలుగు తమ్ముల్లో గుబులు, బాబు హమీ ఇదీ..
హరికిపై దాడికి దిగిన కారును జీవితకాలం పాటు వాటర్ వాష్ చేయవద్దని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న హరికిపై దాడి చేయడంతో ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి కారణం లేకుండానే దాడి చేయడంతో ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.బాధితురాలైన హరికికి ఆ సంస్థ అండగా నిలిచింది.