ఇండోనేషియాలో ఈరోజు ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 188మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం సముద్రంలో కుప్పకూలింది. కాగా.. విమాన ప్రమాదానికి కొద్ది క్షణాల ముందు ఏం జరిగిందో అక్కడి అధికారి ఒకరు తెలిపారు.  విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికి.. వెనక్కి మళ్లడానికి అనుమతి కోరినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఆ వెంటనే.. విమానం నుంచి సంబంధాలు తెలిగిపోయానని చెప్పారు.

ది లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది.  అనంతరం 6:33కి అంటే సరిగ్గా  13 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.
 
కాగా  సంబంధాలు తెగిపోయే కొద్ది నిమిషాల ముందే తిరిగి వచ్చేందుకు అనుమతి కోరినట్టు ఎయిర్ నేవిగేషన్‌ ఒకరు పేర్కొన్నారు. అంతలోనే విమానం ఆచూకీ లేకుండా పోయిందన్నారు. కాగా ప్రమాద సమయంలో మొత్తం 178 ప్రయాణికులు, ఓ చిన్నారి, ఇద్దరు పసికందులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ సిందు రహయు వెల్లడించారు.
 
సుమత్రా దీవుల్లోని పంకాల్ పినాగ్ బయల్దేరిన ఈ విమానంలో మొత్తం 23 మంది ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, విమాన శకలాలు కనిపించినట్టు ఇండోనేషియా విపత్తు సహాయక అధికారి ఒకరు ట్వీట్ చేశారు. దీంతో పశ్చిమ జావా తీరంలో విమానం కూలిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. విమాన శకలాలను గుర్తించేందుకు జకర్తా పోర్టు నుంచి ఓ టగ్ బోట్ బయలుదేరి వెళ్లింది.

read more news

ఇండోనేషియాలో కూలిన విమానం... పైలెట్ మనవాడే..

ఇండోనేషియాలో సముద్రంలో కూలిన విమానం.. విమానంలో 200 మంది