ఇండోనేషియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 188 మందితో జకార్తా నుంచి పినాంగ్‌కు వెళుతున్న లయన్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన 13 నిమిషాలకే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి.

అదృశ్యమైన విమానం కోసం ఎయిర్‌ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో జావా సముద్ర తీరంలో విమాన శకలాలు గుర్తించినట్లు వారు ప్రకటించారు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 181 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది సహా 188 మంది దుర్మరణం పాలైనట్లునని భావిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.