Asianet News TeluguAsianet News Telugu

ఆ దేశ వైఖరిని ప్రతిబింబిస్తుంది.. చైనా రాయబారి వ్యాఖ్యలకు శ్రీలంకలోని భారత హైకమిషన్‌ కౌంటర్

శ్రీలంక అంతర్గ వ్యవహారాల్లో భారత్ జోక్యం  చేసుకుంటోందని చైనా చేస్తున్న పరోక్ష ఆరోపణలపై భారత్ స్పందించింది. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Indian embassy in sri lanka Slams Chinese envoy Lanka remarks
Author
First Published Aug 28, 2022, 9:22 AM IST

శ్రీలంక అంతర్గ వ్యవహారాల్లో భారత్ జోక్యం  చేసుకుంటోందని చైనా చేస్తున్న పరోక్ష ఆరోపణలపై భారత్ స్పందించింది. శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్టు చేసింది. చైనా రాయబారి వ్యాఖ్యలను చూశామని పేర్కొంది. చైనా రాయబారి ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడం వ్యక్తిగత లక్షణం కావచ్చని, లేకపోతే ఆ దేశం వైఖరికి ప్రతిబింబం కావచ్చని ట్వీట్ చేసింది. శ్రీలంకకు ప్రస్తుతం  సహాయం, మద్దతు అవసరమని భారత్ పేర్కొంది. మరో దేశం తన ఎజెండాను కొనసాగించడం కోసం అనవసరమైన ఒత్తిడి, వివాదాలు కాదని తెలిపింది. 

శ్రీలంకలోని చైనా రాయబారి క్వి జెన్‌హాంగ్ శుక్రవారం మాట్లాడుతూ.. వారి దేశానికి చెందిన బాలిస్టిక్ క్షిపణి, ఉపగ్రహ నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్‌టోటా ఓడరేవులో లంగరు వేయబడటంపై భారతదేశం అభ్యంతరాలను ప్రస్తావించారు. భారత్ పేరును ప్రస్తావించకుండా.. భద్రతాపరమైన ఆందోళనలు అని పిలవబడే వాటిపై ఎటువంటి ఆధారాలు లేవని క్వి జెన్‌హాంగ్ అన్నారు. నిరోధం అనేది శ్రీలంక సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం‌లో పూర్తిగా జోక్యం చేసుకోవడమే అని చెప్పారు. చివరికి శ్రీలంక చైనా నౌకను హంబన్‌టోటా ఉంచడానికి అనుమతించినందుకు చైనా సంతోషిస్తోందని అని తెలిపారు. బీజింగ్, కొలంబో సంయుక్తంగా పరస్పరం సార్వభౌమాధికారం, స్వాతంత్ర్యం, ప్రాదేశిక సమగ్రతను పంచుకుంటాయని చెప్పారు. 

 

 

ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం.. ‘‘చైనా రాయబారి వ్యాఖ్యలను గుర్తించాము. ఆ ప్రకటన ఆయన ప్రాథమిక దౌత్య మర్యాదలను ఉల్లంఘించడమే’’ అని ట్వీట్ చేసింది. ‘‘శ్రీలంక ఉత్తర పొరుగు దేశం పట్ల అతని అభిప్రాయం.. అతని సొంత దేశం ప్రవర్తన ద్వారా ప్రభావితమై ఉండవచ్చు. కానీ భారతదేశం అలాంటిది కాదని.. భారతదేశ దృక్పథం చాలా భిన్నంగా ఉందని మేము వారికి హామీ ఇస్తున్నాం. సైంటిఫిక్ రీసెర్చ్ షిప్ అని చెప్పుకునే ఓడ యాత్రకు భౌగోళిక, రాజకీయ సందర్భాన్ని ఆపాదించడం ద్వారా యాత్ర ఉద్దేశాన్ని స్పష్టం చేశారు’’ అని శ్రీలంకలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios