Asianet News TeluguAsianet News Telugu

బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌ కి ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఆ విషయంపై చర్చ  !

బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ప్రధానిగా ఎన్నికైన  సునాక్‌ను ప్రధాని  అభినందించారు. ఈ సందర్భంగా భారత్-యూకే ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య ఒప్పందంపై మోదీ చర్చించారు. ఎఫ్‌టిఎను వీలైనంత త్వరగా ముగించాలని ఇరువురు నేతలూ కట్టుబడి ఉన్నారని పీఎంవో తెలిపింది. 

In First Call, PM Modi, Rishi Sunak Discuss India-UK Trade Deal
Author
First Published Oct 27, 2022, 11:02 PM IST

బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్‌ కి ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫోన్‌ చేసి మాట్లాడారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఈ తరుణంలో ఇరుదేశాల సంబంధాలను బలోపేతంపై గురించి త్వరలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా  ఇరు దేశాల మధ్య సంతులిత స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో ముగించాల్సిన అవసరం గురించి ప్రధాని నరేంద్రమోదీతో పాటు బ్రిటన్ ప్రధాని రిషి సునక్ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నేడు బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్‌తో మాట్లాడటం ఆనందంగా ఉందని.ఆయనకు అభినందనలు తెలిపారు. తమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తాము కలిసి పని చేస్తామని ప్రధాని అన్నారు. 

ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. యూకే, భారత్ మధ్య  భద్రత, సమగ్ర , సమతుల్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) యొక్క ముందస్తు ముగింపు యొక్క ప్రాముఖ్యతను అంగీకరించామనీ, రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయని బ్రిటిష్ ప్రధాని అన్నారు. ఇరు దేశాల సమగ్ర, సమతుల్య FTA ముందస్తు ముగింపు ప్రాముఖ్యతపై కూడా తాము అంగీకరించామని ప్రధాని మోదీ వెల్లడించారు. బ్రిటన్‌ విదేశాంగ కార్యదర్శి జేమ్స్‌ శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌తో చర్చలు జరిపేందుకు భారత్‌కు వస్తున్నారు. దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరువురు చర్చిస్తారని బ్రిటన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది.

బ్రిటన్ మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి, 200 సంవత్సరాలలో బ్రిటన్‌లో అత్యున్నత పదవిని నిర్వహించిన అతి పిన్న వయస్కుడైన నాయకుడు రిషి సునక్ అని ట్వీట్ చేశారు. రాబోయే నెలలు, సంవత్సరాల్లో మన భద్రత, రక్షణ, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం ద్వారా మన రెండు గొప్ప ప్రజాస్వామ్యాలు అనేకం సాధించగలవని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం (అక్టోబర్ 24) కూడా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.. "బ్రిటన్ ప్రధానమంత్రి అయినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు, ప్రపంచ సమస్యలపై కలిసి పనిచేయడానికి మరియు 2030 రోడ్‌మ్యాప్‌ను అమలు చేయడానికి నేను ఎదురుచూస్తున్నాను. మా చారిత్రాత్మక బంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మార్చుకుంటున్న బ్రిటీష్ భారతీయుల జీవన వారధికి ప్రత్యేక దీపావళి శుభాకాంక్షలు." అని పేర్కొన్నారు.


 రిషి సునక్ ఏమి వాగ్దానం చేశాడు?

రిషి సునక్ మంగళవారం (అక్టోబర్ 25) భారత సంతతికి చెందిన మొదటి బ్రిటీష్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, చిక్కుల్లో పడిన దేశ అవసరాలను "రాజకీయాలకు అతీతంగా" ఉంచుతానని, తన ముందు పాలకులు చేసిన "తప్పులను సరిదిద్దుతానని అన్నారు.దీపావళి రోజున కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతగా సునక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యూకే మాజీ ఆర్థిక మంత్రి సునక్ (42) హిందువు , గత 210 ఏళ్లలో బ్రిటన్‌కు అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి.

బ్రిటన్ "తీవ్రమైన ఆర్థిక సంక్షోభం" ఎదుర్కొంటున్న సమయంలో తాను పదవీ బాధ్యతలు స్వీకరించానని ప్రధానమంత్రి అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల తన మొదటి ప్రసంగంలో బ్యాంకర్ అయిన సునక్ చెప్పారు. కోవిడ్ మహమ్మారి , రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా మరో కారణమని, ఆ సవాళ్లను ఎదుర్కోగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Follow Us:
Download App:
  • android
  • ios