Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి ఆ మాజీ క్రికెటర్లకు ఆహ్వానం

పాకిస్థాన్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమానికి ముగ్గురు ఇండియన్ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీం ఇండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, నవ జ్యోత్ సింగ్ సిద్దూ, సునీల్ గవాస్కర్లను ఆహ్వానించినట్లు పీటిఐ పార్టీ తెలిపింది. 

Imran Khan tweaks guest list, invites Navjot Sidhu, Kapil Dev to oath-taking
Author
Islamabad, First Published Aug 11, 2018, 12:24 PM IST

పాకిస్థాన్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమానికి ముగ్గురు ఇండియన్ క్రికెటర్లకు ఆహ్వానం అందింది. ఇటీవల జరిగిన పాకిస్థాన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అతిపెద్ద పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధాని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీం ఇండియా మాజీ ఆటగాళ్లు కపిల్ దేవ్, నవ జ్యోత్ సింగ్ సిద్దూ, సునీల్ గవాస్కర్లను ఆహ్వానించినట్లు పీటిఐ పార్టీ తెలిపింది. 

ఈ ఆహ్వనం గురించి పిటిఐ పార్టీ నాయకుడు ఫైజల్ జావేద్ ఖాన్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ట్వీట్ చేశారు. ఇండియన్ టీం మాజీ సారథులు, క్రికెట్ లెంజెడ్స్ కపిల్ దేవ్, గవాస్కర్, సిద్దూకు పాకిస్థాన్ ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించినట్లు ట్వీట్ చేశాడు. ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ టీంలో ఆడిన సమయంలో వీరితో మంచి సంబంధాలను కలిగి ఉండేవారు. ఈ స్నేహం కారణంగానే వీరికి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది.

పాకిస్థాన్ లో జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటిఐ పార్టీ 116 సీట్లు కైవసం చేసుకుంది. అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికి ప్రభుత్వ  ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాలేదు. దీంతో వేరే చిన్న పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిటీఐ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం జరుగుతున్న చర్చలు ఆలస్యమవడంతో ఈ నెల 11న ఉంటుందనుకున్న ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆగస్ట్ 18కి వాయిదా పడింది. 

పాకిస్థాన్ అధ్యక్షుడు మామ్‌నూన్ హుస్సెన్ ఈ నెల 13న అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే పీటిఐ నాయకులు కూడా ప్రధాని ప్రమాణస్వీకార ప్రకటన చేశారు. అయితే పార్టీ తరపున మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరిన్ని వార్తల కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి    

ఇమ్రాన్ కీలక నిర్ణయం.. పాక్ జైళ్ల నుంచి భారతీయుల విడుదలకు ఆదేశం..?

ప్రమాణ స్వీకారానికి రెడీ అవుతున్న ఇమ్రాన్.. షాకిచ్చిన ఎన్నికల సంఘం

భారత్ ఒక అడుగు ముందుకేస్తే మేం రెండడుగులు వేస్తాం: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ రికార్డు సృష్టించనుందా, ఆయన ఆల్రెడీ....
 
Follow Us:
Download App:
  • android
  • ios