పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ రికార్డు సృష్టించనుందా, ఆయన ఆల్రెడీ....

Pakistan Election 2018: Imran Khan's party leading
Highlights

మాజీ క్రికెటర్, ప్రస్తుత పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్ఱధాని పీఠానికి అతిచేరువయ్యారు. ఆయన నేతృత్వంలోని పిటీఐ పార్టీ పాకిస్థాన్ 11వ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో  దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్ తాను పోటీ చేసిన ఐదు స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించాడు. అయితే ఆయన బాటలోనే పీటీఐ పార్టీ కూడా విజయం వైపు దూసుకుపోతోంది.

నిన్న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగాయి. అయితే పోలింగ్ ముగియగానే వెంటనే ఎన్నికల కమీషన్  కౌంటింగ్ కూడా ప్రారంభించింది. దీంట్లో ఇప్పటివరకు వెలువడిన సమాచారం ప్రకారం పీటీఐ పార్టీ అభ్యర్థులు చాలా చోట్ల ముందంజలో ఉన్నారు. మొత్తం 272 సీట్లకు గానే 119 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలో ఉంది. అయితే పూర్తి మెజారిటీ 137 సీట్ల కు పీటీఐ కాస్త దూరంగా ఉండటంతో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల సపోర్టు తో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో రాజకీయంగా పాకిస్థాన్ ఎన్నికల కౌంటింగ్ పై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక మాజీ ప్రదాని నవాజ్ షరీప్ సారధ్యంలోని పాకిస్థాన్‌-ముస్లింలీగ్‌ -నవాజ్ (పీఎంఎల్‌-ఎన్‌) 55 సీట్లతో రెండోస్థానంలో ఉండగా, బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) 32 చోట్ల ఆధిక్యంలో ఉంది. అయితే పీటీఐకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో పిపిపి పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల అంచనా. ఇదే జరిగితే బిలావల్ భుట్టో కింగ్ మేకర్ గా మారనున్నాడు.

 పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ ఎన్నికల్లో చరిత్ర సృష్టించాడు. తాను పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసాడు. ఎన్ఏ-26 బన్ను, ఎన్ఏ-61 రావల్పిండి, ఎన్ఏ-95 మియావలి, ఎన్ఏ-131 లాహోర్, ఎన్ఏ-243 కరాచీ స్థానాల్లో ఇమ్రాన్ పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు.  

loader