పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన పార్టీ మరో సారి చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1997 సంవత్సరంలో ఇమ్రాన్ ఖాన్  పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అనే సొంత పార్టీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆయనే వరుసగా చైర్మన్ గా ఎన్నికవుతూ వస్తున్నారు. 

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చైర్మన్ గా ఇమ్రాన్ ఖాన్ బుధవారం మరోసారి ఎన్నికయ్యారు. గత ఏడాది పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) ఇచ్చిన గడువుకు ఐదు రోజుల ముందు, ఆ పార్టీ అంతర్గత ఎన్నికలను జూన్ 8వ తేదీన చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగానే నేడు ఎన్నిక‌లు నిర్వ‌హించి, ఫలితాలు కూడా ప్ర‌క‌టించారు. 

ఇరాన్‌లో కఠిన శిక్షలు.. మైనార్టీలే అత్యధికం.. ఒకే రోజు ఒక మహిళ సహా 12 మందికి ఉరి అమలు

వాస్త‌వానికి పీఐటీకి పార్టీ అంతర్గత ఎన్నికల నిర్వహణకు 2021 జూన్ 13వ తేదీ చివ‌రి తేదీ. అయితే ఆ పార్టీ అభ్యర్థన కారణంగా 2022 జూన్ 13వ తేదీ వ‌ర‌కు సమయం ఇచ్చినట్లు ది న్యూస్ ఇంటర్నేషనల్ నివేదించింది. 1997లో ఇమ్రాన్ ఖాన్ తన సొంత రాజకీయ పార్టీ ‘ పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్’ ను స్థాపించారు. ఆయ‌న అక్టోబర్ 2002 ఎన్నికలలో ఒక నేషనల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అప్ప‌టి నుంచి 2007 వరకు ఎన్.ఎ-71, మియాన్ వాలీ నుండి పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. అయితే 2018లో ఇమ్రాన్ ఖాన్ 176 ఓట్ల మెజార్టీతో పాకిస్తాన్ లో అధికారాన్ని చేజిక్కించుకున్నారు.

ఇరాన్‌లో పట్టాలు తప్పిన రైలు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు..

కాగా విశ్వాస తీర్మాణంలో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవ‌డం, ప‌లువురు స‌భ్యుల మ‌ద్ద‌తు ఉప సంహ‌ర‌ణ వ‌ల్ల ఆయ‌న అధికారానికి దూరం అయ్యారు. అయినా ఆయ‌న ప్ర‌భుత్వంలో కొన‌సాగాల‌ని చూశారు. దీంతో పాకిస్తాన్ సుప్రీంకోర్టు క‌లుగజేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ త‌న పద‌వి నుంచి తొల‌గిపోవాల‌ని ఆదేశించింది. దీంతో ఆయ‌న అధికారం నుంచి త‌ప్పుకున్నారు. 342 మంది సభ్యుల సభలో 174 మంది సభ్యులు ఈ తీర్మాణానికి అనుకూలంగా ఓటు వేయగా, అధికార పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు ఓటింగ్ కు గైర్హాజ‌ర‌య్యారు. 

Mexico: సెంట్రల్ మెక్సికోలో కాల్పులు.. ఐదుగురు విద్యార్థుల మృతి

కాగా.. తిరిగి పీఐటీకి ఈరోజు చైర్మ‌న్ గా ఎన్నికైన నేప‌థ్యంలో జాతీయ కౌన్సిల్ సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. విదేశీ బ్యాంకు ఖాతాల్లో బిలియన్ డాలర్లను నిల్వ చేసినందున ప్రస్తుత పాలకులు దేశం కోసం నిల‌బ‌డ‌బోర‌ని విమ‌ర్శించారు. ప్రస్తుత పాలకులు యునైటెడ్ స్టేట్ ఆమోదం లేకుండా ఏమీ చేయరు అని ఆరోపించారు. ప్ర‌స్తుతం పాకిస్తాన్ ను ఏలుతున్న నాయ‌కులకు విదేశాల బ్యాంకుల్లో బిలియన్ డాలర్లు నిల్వ ఉన్నాయ‌ని ఆరోపించారు. 

సెవెరోడోనెట్స్క్ నివాస ప్రాంతాలను మా ఆధీనంలోకి తీసుకున్నాం - రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు

2008 నుంచి 2018 వరకు పాకిస్థాన్ పై అమెరికా 400 డ్రోన్ దాడులు చేసిందని, ఇది మునుపెన్నడూ లేని విధంగానే ఉందని అన్నారు. రష్యా కులీన వర్గాలతో సమానంగా తమకు కూడా అదే గతి పడుతుందని వారు భయపడుతున్నారని పీటీఐ చైర్మన్ పేర్కొన్నారు.