చైనాలోని ఐకియా స్టోర్‌లో షాపింగ్‌కు వచ్చిన ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. అర్థనగ్నంగా తిరుగుతూ అనుచితంగా ప్రవర్తించింది. వివరాల్లోకి వెళితే.. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని ఓ స్టోర్‌లో షాపింగ్ చేసేందుకు వచ్చిన ఆ మహిళ తోటి కస్టమర్లు ఉన్నారనే భయం కూడా లేకుండా హస్తప్రయోగానికి పాల్పడింది.

అమ్మకానికి సిద్ధంగా ఉంచిన కొత్త సోఫాలు, బెడ్స్‌‌పై దొర్లుతూ ఆమె చేసిన వికృత్య చేష్టలను కస్టమర్లలో ఒకరు రహస్యంగా చిత్రీకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ వ్యక్తి చైనీస్ సోషల్ మీడియా సైట్‌లో షేర్ చేశాడు. ఈ వీడియోకు కొద్ది క్షణాల్లోనే కోటికిపైగా వ్యూస్ వచ్చాయి.

Also Read:సిగరెట్లు తాగేవారిని అంతగా టచ్ చేయని కరోనా: అధ్యయనం

దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు ఐకియా సంస్థపై విమర్శలకు దిగారు. కస్టమర్ల కోసం ఉంచిన కొత్త ఫర్నీచర్‌ను ఇలాగే అమ్ముతారా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో స్పందించిన ఐకియా యాజమాన్యం.. తమ స్టోర్లలో మహిళలు గానీ, పురుషులు గానీ ఇలాంటి వికృత చర్యలకు పాల్పడటాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపింది.

చైనీస్ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్టోర్లలోనూ భద్రతను కట్టుదిట్టం చేస్తామని, ఇకపై ఇలాంటి ఘటనలకు తావు లేకుండా కస్టమర్లకు మెరుగైన సేవలందిస్తామని ఐకియా ఓ ప్రకటనలో తెలిపింది.

Also Read:రూటు మార్చిన కరోనా: అమెరికాను వదిలి రష్యాలో తిష్ట!

మరోవైపు ఐకియా పరువు తీసిన ఆ మహిళ ఎవరా అన్నదానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సదరు వీడియోలో ఎవరు కూడా మాస్కులు ధరించి ఉండకపోవడంతో ఈ ఘటన జనవరిలో జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

కాగా చైనాలో ఇలాంటి ఘటనలు కొత్తకాదు. కొద్దిరోజుల క్రితం చైనా కేంద్రంగా పనిచేస్తోన్న ఓ జపాన్ బ్రాండెడ్ బట్టల షోరూమ్‌లో ఓ జంట బహిరంగంగా శృంగారంలో పాల్గన్న సంఘటన అప్పట్లో కలకలం రేపింది.