Asianet News TeluguAsianet News Telugu

రూటు మార్చిన కరోనా: అమెరికాను వదిలి రష్యాలో తిష్ట!

కరోనా తన రూటు ను మార్చి అటు రష్యా, బ్రెజిల్ పై దాడులు చేస్తున్నది.  రష్యా లో మొదట్లో కేసులు పెద్దగా లేక పోవడంతో కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అనుకుంది.  కానీ, కరోనా ఎటు నుంచి ఎలా వచ్చి కాటేస్తుందో తెలియడం లేదు.  రష్యాలో ఇప్పుడు ఈ వైరస్ భీబత్సం సృష్టిస్తోంది.

Coronavirus now plaguing Russia
Author
Moscow, First Published May 11, 2020, 4:07 PM IST

కరోనా వైరస్ పేరు చెబితే ఇప్పుడు ప్రపంచమే వణికిపోతుంది. అందునా అగ్ర రాజ్యం అమెరికా అయితే... గడగడలాడిపోతుంది. అక్కడ కరోనా ఓ పెద్ద సునామీ ని సృష్టించింది.  ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అక్కడ శవాలను పాతిపెట్టడానికి స్థలం దొరకడంలేదంటే... అతిశయోక్తి కాదు.  

అమెరికా లో దాదాపుగా ఇప్పటి వరకు 13,67,638 కేసులు నమోదయ్యాయి.  80,787 మంది మరణించారు. అధికారిక అంచనాల ప్రకారమే ఇంకొన్ని వేల మరణాలు సంభవిస్తున్నాయని తెలుస్తుంది. దీన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.   

అయితే, గతం తో పోలిస్తే ఆదివారం రోజున ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆదివారం రోజున అమెరికా లో 19,444 కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య కూడా సగానికి పడి పోయింది.  ఆదివారం కేవలం 720 మంది మాత్రమే మరణించినట్టు అమెరికా పేర్కొన్నది.  

కొత్త కేసుల సంఖ్య తగ్గి పోతుండటంతో పాటుగా కోలుకుంటున్న వారి సంఖ్యా కూడా పెరుగుతూ ఉండడంతో ఆ దేశ వాసులు ఒకింత ఊపిరి పీల్చుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇలా కేసులు తగ్గడం, రికవరీ రేట్ కూడా పెరగడం ఆ దేశానికీ ఊరట నిచ్చే అంశంగా చెప్పుకోవాలి.  

అయితే, ఇప్పుడు కరోనా తన రూటు ను మార్చి అటు రష్యా, బ్రెజిల్ పై దాడులు చేస్తున్నది.  రష్యా లో మొదట్లో కేసులు పెద్దగా లేక పోవడంతో కరోనా గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని అనుకుంది.  

కానీ, కరోనా ఎటు నుంచి ఎలా వచ్చి కాటేస్తుందో తెలియడం లేదు.  రష్యాలో ఇప్పుడు ఈ వైరస్ భీబత్సం సృష్టిస్తోంది.ఆదివారం రోజున రష్యా లో 11,012 కేసులు నమోదయ్యాయి. 88 మంది మరణించారు.  ఇది ఆ దేశాన్ని ఇబ్బందులు పెట్టేలా కనిపిస్తోంది.

అటు బ్రెజిల్ ను కరోనా వణికిస్తోంది.  బ్రెజిల్ లో ఆదివారం రోజున ఆరు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 467 మంది మరణించారు.  దీంతో బ్రెజిల్ సైతం అప్రమత్తం అయ్యింది.  
కరోనా కారణంగా అమెజాన్ అడవుల్లో నివసించే ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు.  వీరికి కరోనా సోకితే ఫలితాలు దారుణంగా ఉంటాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది.

ఇకపోతే... భారతదేశంలో కోరనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో దేశంలో 4213 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 67,152కు చేరుకుంది. 

భారతదేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్య కూడా ఆగడం లేదు. కొత్తగా గత 24 గంటల్లో 97 మరణాలు రికార్డయ్యాయి. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2,206కు చేరుకుంది. 

కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక్క రోజులో 4 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 3 వేలకు పైగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. అది కాస్తా 4 వేలు దాటింది.

దేశంలో యాక్టివ్  కేసులు 44,029 ఉన్నాయి. ఇప్పటి వరకు 20,916 చికిత్స పొంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు రికవరీ రేటు 31.15 శాతం ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios