అమెరికాలో ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకున్నట్టు భార్యను నమ్మించాడు. మరో మహిళతో సంసారం మొదలు పెట్టాడు. భర్త మరణించాడని నమ్మిన భార్య అంత్యక్రియలు సిద్ధం అయింది. కానీ, ఆమెకు నిజం తెలిసి ఖంగుతిన్నది.
న్యూఢిల్లీ: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు తన భార్యను నమ్మించాడు. డెడ్ బాడీ కూడా ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడు. ముందుగానే ఆ మహిళతో ఎఫైర్ ఉన్నది. ఆ తర్వాత భార్యను ఆత్మహత్య స్కెచ్‌తో మోసం చేశాడు. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. తాను నమ్మినదంతా అబద్ధమని భార్యకు తెలిసిపోయింది.
కాలిఫోర్నియాకు చెందిన అనెసా రోసీ ఈ ఉదంతాన్ని తన టిక్ టాక్ వీడియోలో పేర్కొంది. తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్టు ఐదు నెలల క్రితం తనను మోసం చేశాడని వివరించింది. తన భర్తకు అంతిమ క్రియలు నిర్వహించే పనిలో ఆమె ఉన్నది. ఇంతలోనే తన భర్త బతికే ఉన్నట్టు తెలుసుకుని ఖంగుతిన్నది. మెక్సికోలో మరో మహిళతో కలిసి జీవిస్తున్నాడని తెలుసుకుంది.
అనెసా రోసీ తన భర్తతో విడిపోయే ప్రక్రియలో ఉన్నది. వారు ఇప్పుడు వేర్వేరుగా ఉంటున్నారు. తనతో విడిపోయిన తర్వాత భర్త ఐదు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం వచ్చిందని ఆమె తెలిపింది. మయామీ డేడ్ పోలీసులు ఫోన్ చేసి తమకు ఆమె భర్త డెడ్ బాడీ కనిపించిందని, ఆయన బహుశా ఆత్మహత్యతో చనిపోయి ఉంటాడని అనెసా రోసీకి తెలిపారు.
ఫ్లోరిడాలో ఉన్న భర్త కుటుంబం ఆయనకు అంతిమ క్రియలకూ ప్లాన్ చేసినట్టు తనకు ఫోన్ చేశారని, అయితే, ఆమె ఆ కార్యక్రమానికి రావొద్దనీ విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపింది. భర్తతో డైవర్స్ ప్రక్రియలో కొనసాగుతున్న తరుణంలో ఈ అంత్యక్రియలకు ఆమె హాజరవడాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించారు. తమకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినట్టు ఆమె వివరించింది.
Also Read: అంబానీ పార్టీలో ఫుడ్‌తో టిష్యూకు బదులు కరెన్సీ నోట్లు? ఆ వైరల్ ట్వీట్ ఏం చెబుతున్నదంటే?
అయితే, తనకు ఓ నెటిజన్ డైరెక్ట్ మెసేజ్‌లో షాకింగ్ విషయాలు తెలిపాడని ఆమె వివరించారు. ఆమె భర్త బతికే ఉన్నాడని, మరో మహిళతో జీవిస్తున్నాడని తెలిపారు. ఆరేళ్లుగా ఎఫైర్ పెట్టుకున్న యువతితోనే జీవిస్తున్నాడని వివరించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించడంతో తాను షాక్ అయినట్టు ఆ మహిళ వీడియోలో పేర్కొంది.
ఈ వీడియో తర్వాత ఆమె భర్త ఈ ఆరోపణలను ఖండించారు. తాను అలాంటిదేమీ చేయలేదని ఓ వీడియో పోస్టు చేశారు.
