టెక్కీలకు షాక్: 5 వేల ఉద్యోగుల తొలగింపుకు హెచ్‌పీ ప్లాన్

HP sees up to 5,000 job cuts as part of restructuring plan
Highlights

టెక్కీల ఉద్యోగాలకు ఎసరు

న్యూయార్క్: అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ హెచ్‌పి ఉద్యోగులకు షాకిస్తోంది.
2019 ఫైనాన్షియల్ ఈయర్ చివరికి సుమారు ఐదువేల ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆ
కంపెనీ ప్రకటించింది.

కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 
ఉద్యోగుల తొలగింపును  చేయాల్సి వస్తోందిన
హెచ్‌పీ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 2016 అక్టోబర్ మాసంలోనే హెచ్‌పీ కంపెనీ బోర్డు
 కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియకు ఆమోదం తెలిపింది.

ఈ కంపెనీ నుండి సుమారు నాలుగు వేల మందని తొలగించనున్నట్టు కంపెనీ
ప్రకటించింది.ప్రస్తుతం ఈ కంపెనీలో సుమారు 49 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
 
హెచ్‌పీ రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో లేఆఫ్స్‌కు సంబంధించి ప్రీట్యాక్స్‌ ఛార్జీలు
సుమారు రూ.4700 కోట్లు గా ఉంటాయని కంపెనీ తెలిపింది. అంతకముందు ఇవి 500
మిలియన్‌ డాలర్లుగా కంపెనీ అంచనావేసింది.

 2018లో 22.6 శాతం మార్కెట్‌ షేరుతో హెచ్‌పీ ప్రపంచవ్యాప్తంగా పీసీ సరుకు
రవాణాల్లో టాప్‌ స్థానంలో ఉంది. క్వార్టర్‌ ముగింపు నాటికి అంచనావేసిన దానికంటే
మెరుగైన విక్రయాలనే ఈ కంపెనీ నమోదు చేసింది. 

loader