పాక్ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు హిందువులు పోటీ చేసిన దాఖలాలు లేవు.. అలాంటిది ఏకంగా ఓ మహిళ రంగంలోకి దిగింది.. సింధ్ ప్రావిన్స్‌లోని తారక్‌పూర్ జిల్లాలలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి ఓ హిందూ మహిళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. ఆమె పేరు సునీతా పార్మర్.
దేశం మొత్తం ముస్లింల ఆధిపత్యం ఉండే పాకిస్తాన్ లో హిందువుల దయనీయ స్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మత ఛాందసవాదుల దాడుల, అత్యాచారాలు, బలవంతపు మతమార్పిడితో ఇప్పటికే పాకిస్థాన్‌లో హిందువుల జనాభా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికి ఉన్న కొద్ది మంది తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నెల 25న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
పాక్ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు హిందువులు పోటీ చేసిన దాఖలాలు లేవు.. అలాంటిది ఏకంగా ఓ మహిళ రంగంలోకి దిగింది.. సింధ్ ప్రావిన్స్‌లోని తారక్‌పూర్ జిల్లాలలోని సింధ్ అసెంబ్లీ స్థానం నుంచి ఓ హిందూ మహిళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.. ఆమె పేరు సునీతా పార్మర్.
31 ఏళ్ల ఈమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు.. ప్రధానంగా మహిళా సమస్యలు.. కనీస వైద్యం, విద్య అందడం లేదంటూ సునీత గళం వినిపిస్తున్నారు.. తనను గెలిపిస్తే ఈ పరిస్థితిలో మార్పు తెస్తానంటున్నారు. కాగా, తారక్‌పూర్ జిల్లాలో మొత్తం 16 లక్షల మంది జనాభా వుండగా.. వీరిలో హిందువులు 8 లక్షల మంది. ముస్లింల ప్రాబల్యాన్ని తట్టుకుని సునీత ఏ మేరకు ఎన్నికల్లో గెలుస్తారోనని అక్కడి జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.