హమాస్ మంచిగానే చూసుకుంది, సాలెగూళ్ల లాంటి సొరంగాళ్లలోకి తీసుకెళ్లారు: విడుదలైన ఇజ్రాయెల్ మహిళ

హమాస్ తమను బాగానే చూసుకుందని, తమను సాలెగూళ్ల వంటి సొరంగాల్లో బంధించినప్పుడు ఒక వైద్యుడు పరీక్షించాడని సోమవారం హమాస్ చెర నుంచి విడుదలైన ఓ వృద్ధ మహిళ తెలిపారు. హమాస్ సమస్యను ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోలేదని అన్నారు.
 

hamas treated me well says freed israel woman kms

న్యూఢిల్లీ: హమాస్ నిర్బంధించిన పెద్దావిడను రాత్రిపూట విడుదల చేశారు. ఆమె హమాస్ సాయుధుల గురించి, వారు ఆమెతో వ్యవహరించిన విధానం గురించి మాట్లాడారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ సాయుధులు తనను గాజాలోకి తీసుకెళ్లారని, ఆ తర్వాత రెండు వారాలపాటు పాలస్తీనాలోని సొరంగాల్లో తనను బంధించారని చెప్పారు. ఈ రెండు వారాల వ్యవధిలో తనను బాగానే చూసుకున్నారని తెలిపారు.

సోమవారం సాయంత్రం హమాస్ విడుదల చేసిన ఆ మహిళ పేరు ఫ్‌షిట్జ్ (85 ఏళ్లు). ఆ మహిళ తన నిర్బంధం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నిర్బంధించిన సొరంగాలు సాలెగూడును తలపించాయని తెలిపారు. అందులో తమను బంధించినప్పుడు వారు బాగానే చూసుకున్నారని వివరించారు. తనను ఇజ్రాయెల్ నుంచి గాజాలోకి ఓ హమాస్ యువ సాయుధుడు బైక్ పై తీసుకెళ్లారని తెలిపారు. బైక్ పై తల ఒక వైపు, మిగితా శరీరం మరో వైపు పెట్టి తీసుకెళ్లారని చెప్పారు. తన పక్కటెముకలు దాదాపు విరిగిపోయినంత పనైందని వివరించారు. కానీ, ఎముకలు విరగలేదని అన్నారు. అయితే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని తెలిపారు.

Also Read: ఎన్నికల వేళ తనిఖీలు.. రద్దయిన పాత నోట్ల కట్టలతో పట్టుబడ్డ వ్యక్తి.. ఇంతకీ ఆ నోట్లను ఏం చేయాలని అనుకున్నాడు?

తమను సాలెగూడ వంటి సొరంగాల్లో బంధించినప్పుడు ఓ వైద్యుడు తమను పరీక్షించాడని ఆమె వివరించారు. హమాస్ తమను మంచిగానే చూసుకుందని అన్నారు. తమ అవసరాలను తీర్చినట్టు తెలిపారు. హమాస్ ముప్పును ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోలేదని, హమాస్ ‌ను అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ వారిని సమర్థవంతంగా నిలువరించలేకపోయిందని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios