Israel-Palestine War: ‘హమాస్ ప్రయోగించిన క్షిపణి 15 సెకండ్లలో ఇక్కడకు వస్తుంది’
ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్ యుద్ధ భూమి ఇజ్రాయెల్ నుంచి అక్కడి ప్రజల పరిస్థితులను మనకు వివరిస్తున్నారు. ఆయన గాజా సరిహద్దుకు సమీపంలోని ఇజ్రాయెల్ నగరం స్దెరాట్‌కు వెళ్లారు. ఈ నగరం నుంచి ఇజ్రాయేలీలను సురక్షిత ప్రాంతాలకు తరలించగా అక్కడ ఇప్పుడు కేవలం 5000 మంది ఇజ్రాయెలీలు మాత్రమే ఉన్నారు. ఈ కల్లోలిత ప్రాంతంలో ఇజ్రాయెల్ ఆర్మీ క్రియాశీలకంగా ఉన్నది.
న్యూఢిల్లీ: గాజా సరిహద్దుకు సమీపంగా ఉండే ఇజ్రాయెలీ నగరం స్దెరాట్ ఇప్పుడు ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధంలో కీలకంగా ఉన్నది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు ఎక్కువగా ఈ నగరమే నలిగిపోతున్నది. ఇప్పడు స్దెరాట్ వీధుల్లో పౌరులు కనిపించడం లేదు. అయితే, అలర్ట్‌గా హడావిడిలో ఉన్న ఇజ్రాయెలీ సైన్యం కనిపిస్తున్నది. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి ఓ స్థానిక వాలంటీర్‌తో ముచ్చటించింది.
ఏషియానెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్ అజిత్ హనమక్కనవర్: 20 నిమిషాల క్రితం ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మాకు చెప్పండి?
వాలంటీర్: అది ఒక క్షిపణి దాడి. మనకు చాలా సమీపంలోనే ఆ మిస్సైల్ పడింది. సుమారుగా 100 మీటర్ల దూరానికి ఎక్కువ ఏమీ లేదు. ఒక ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో క్షతగాత్రులెవరూ లేరు.
అజిత్ హనమక్కనవర్: ఈ నగరమంతా నిర్మానుష్యంగా నిశబ్దంగా మారిపోయింది. అందరూ ఎక్కడికి పోయారు?
వాలంటరీ: స్దెరాట్ 30 వేల ప్రజలకు ఇల్లు వంటిది. ఇందులో 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారిని మేమే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లుతున్నాం. అయితే.. చాలా మంది తమ పెంపుడు జంతువుల కారణంగా స్దెరాట్ వదిలివెళ్లడం లేదు. అయితే.. 99 శాతం జనాభా సురక్షిత ప్రాంతాలకు తరలిపోవడం గుడ్ న్యూస్. ఇక్కడ ఐఱన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ పని చేయదు.
Also Read : కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఐపీఎల్ టీమ్, మధ్యప్రదేశ్‌లో సంచలన హామీలు
ఈ సందర్భంలో స్దెరాట్‌లో కేవలం 5,000 మంది మాత్రమే ఉండిఉంటారు. గాజాకు ఈ నగరం అతి సమీపంగా ఉంటుందని, అందువల్లే గాజాలో హమాస తీవ్రవాదులు ఒక బాంబు విడిస్తే అది కేవలం పదిహేను సెకండ్లలోనే ఈ నగరానికి చేరిపోతుందని తెలిపారు.
ఆ రాకెట్లు రా మెటీరియల్‌తో తయారు చేసినవి. ఈ నగర పౌరులకు ఈ బాంబులు నుంచి ప్రధానంగా మప్పు ఉన్నది. ఇజ్రాయెల్‌కు తమ బలం చూపించడంలో భాగంగా ఇజ్రాయెలీ సైన్యం ఇద్దరు హమాస్ తీవ్రవాదులను చంపేసి వీధిలో ఎండకు వదిలిపెట్టారు. ఆ డెడ్ బాడీలు మెల్లిగా కుళ్లిపోతున్నాయి.
ఇజ్రాయెలీ సైన్యం ఇక్కడ క్రియాశీలకంగా ఉన్నది. తరుచూ హమాస్ పై షెల్స్ దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్ , హమాస్‌ల మధ్య జరుగుతున్న యుద్ధ తీవ్రతను ఈ నగరం సంపూర్ణంగా విశదపరుస్తున్నది.