ప్లేగ్రౌండ్‌లు, స్విమ్మింగ్ పూల్స్‌లో హమాస్ రాకెట్లు దాచింది.. పౌరులను కవచంగా వాడుతోంది.. ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలోని ఆసుపత్రుల క్రింద, ప్రక్కనే ఉన్న హమాస్ సొరంగాలు, కమాండ్ సెంటర్లు రాకెట్ లాంచర్‌ల నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసిన రోజునే ఈ వీడియో వెలుగు చూసింది. 

Hamas hides rockets in playgrounds, swimming pools and uses civilians as cover says Israel - bsb

గాజా : ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజాలోని స్విమ్మింగ్ పూల్, ప్లేగ్రౌండ్‌కు సమీపంలో హమాస్ రాకెట్ లాంచర్‌లను తమ సైన్యం గుర్తించినట్లు చూపించే వీడియోను విడుదల చేసింది. ఉత్తర గాజాలోని ప్లేగ్రౌండ్, అమ్యూజ్‌మెంట్ పార్క్ కాంపౌండ్‌లో హమాస్ రాకెట్ లాంచర్‌లను దాచిపెట్టిందని ఇజ్రాయెల్ దళాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ భూభాగంలో రాకెట్లను ప్రయోగించడానికి హమాస్ కార్యకర్తలు సైట్‌లను ఉపయోగిస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ఐదవ వారంలోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర యుద్ధానికి తెరతీస్తుందన్న భయాలు నెలకొన్నాయి.

"ఉగ్రవాద ప్రయోజనాల కోసం హమాస్ టెర్రర్ ఆర్గనైజేషన్ పౌరులను మానవ కవచంగా ఉపయోగిస్తుందనడానికి ఇది రుజువు, ఇది నిరంతరంగా జరుగుతుందనడానికి నిదర్శనం" అని ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ సైనికులు ఫేస్ బుక్ లో ఐడీఎఫ్ పోస్ట్ చేసిన వీడియోలో చూసినట్లుగా, పిల్లల స్విమ్మింగ్ పూల్ నుండి ఐదు మీటర్లు (16 అడుగులు), ఉత్తర గాజా స్ట్రిప్‌లోని ఇళ్ల నుండి 30 మీటర్ల దూరంలో నాలుగు భూగర్భ లాంచర్‌లను కనుగొన్నారు.

గాజాను రెండుగా విభజించి.. : దాడులను మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్ సైన్యం..

ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాలోని ఆసుపత్రుల క్రింద,ప్రక్కనే ఉన్న హమాస్ సొరంగాలు, కమాండ్ సెంటర్లు, రాకెట్ లాంచర్‌ల నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసిన రోజున ఈ వీడియో బైటికి వచ్చింది. "హమాస్ తన యుద్ధ యంత్రంలో భాగంగా ఆసుపత్రులను క్రమపద్ధతిలో దోపిడీ చేస్తుందని రుజువు చేసే సాక్ష్యాలను మీతో షేర్ చేస్తున్నాం" అని ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి ఫేస్ బుక్ లో అధికారిక లైవ్ స్ట్రీమ్‌లో తెలిపారు.

ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు, ఆడియో రికార్డింగ్‌లను చూపించాడు. ఆసుపత్రులను కవర్‌గా ఉపయోగించుకోవడం, పౌరులు పోరాట ప్రాంతాలను విడిచిపెట్టకుండా నిరోధించడంలో హమాస్ వ్యూహాం అమలు చేసింది. "హమాస్ తన యుద్ధ యంత్రంలో భాగంగా ఆసుపత్రులను క్రమపద్ధతిలో దోపిడీ చేస్తుంది" అని ఇజ్రాయెల్  ప్రధాన సైనిక ప్రతినిధి హగారి విలేకరులతో అన్నారు.

షిఫా హాస్పిటల్ లోపల, కింద హమాస్ కమాండింగ్ కంట్రోల్ సెంటర్‌లు ఉన్నట్లు రుజువులు షేర్ చేస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది. కానీ హమాస్ దీన్ని ఖండించింది. ఇజ్రాయెల్ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఆరోపించింది.

ఇజ్రాయెల్ వారాల తరబడి గాజా  ప్రధాన ఆసుపత్రి అల్-షిఫాపై దృష్టి సారించింది, హమాస్ దానిని భూగర్భ కార్యాచరణ కేంద్రాలకు కవచంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. ఆదివారం నాడు, హగారి ఆరోపించిన ఆస్పత్రల్లు ఉత్తర గాజాలోని ఖతారీ నిధులతో నడిచే షేక్ హమద్ హాస్పిటల్, ఇండోనేషియా సమూహాలచే నిర్మించబడిన ఆసుపత్రి.. ఇలా మరో రెండు ఆసుపత్రులు ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios