ప్రేగ్ యూనివర్శిటీలో కాల్పులు, 15 మంది మృతి.. మొదట తండ్రిని చంపి, కాల్పుల తరువాత తాను కాల్చుకున్న నిందితుడు..
చెక్ రిపబ్లిక్ లో సామూహిక కాల్పులు జరిగాయి. ఈ దారుణ ఘటనలో 15మంది మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. నిందితుడు ఆ తరువాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
ప్రేగ్ : చెక్ రిపబ్లిక్‌లో ఘోరమైన ఘటన వెలుగు చూసింది. గత కొద్ది దశాబ్దాల కాలంలో ఇంతటి అత్యంత దారుణమైన కాల్పుల ఘటన జరగలేదు. గురువారం ప్రేగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన కాల్పుల్లో 24 ఏళ్ల దుండగుడితో సహా 15 మందికి పైగా మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తి చనిపోయాడని అధికారులు తెలిపారు.
చారిత్రాత్మక నగరంలో ఘోరమైన హింస వెలుగు చూసింది. ప్రజలు భయబ్రాంతులయ్యారు. ఘటన సమాచారం తెలియడంతో సాయుధ పోలీసులలు భారీగా మోహరించారు. ప్రజలను ఇంట్లో నుంచి బైటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.
సోషల్ మీడియా ఎక్స్ వెబ్ సైట్ డౌన్: నిలిచిన సేవలు
14వ శతాబ్దపు చార్లెస్ బ్రిడ్జ్ వంటి ప్రధాన పర్యాటక ప్రదేశాలకు సమీపంలో ఉన్న చార్లెస్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ వద్ద కాల్పులు జరిగాయి. "15 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కనీసం 24 మంది గాయపడ్డారు" అని పోలీసు చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ కాల్పుల తరువాత విలేకరులతో అన్నారు.
అత్యవసర సేవల విభాగం మొదట తొమ్మిదిమందికి తీవ్రమైన గాయాలు, కనీసం ఐదు మందికి కాస్త ఎక్కువ గాయాలు, 10 వరకు తేలికపాటి గాయాలు అయ్యాయని తెలిపాయి. ప్రేగ్‌కు పశ్చిమాన హోస్టూన్ గ్రామంలో నిందితుడి తండ్రి కూడా చనిపోయాడని పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించిన తరువాత ఈ విషయం వెలుగు చూసింది.
ముష్కరుడు " తాను చనిపోవాలనుకుంటున్నానని చెప్పి ప్రేగ్‌కు బయలుదేరాడు" అని ఓ వ్యక్తి తెలిపారు. అంటే ప్రేగ్ కు బయలు దేరే ముందే దుండగుడు తన తండ్రిని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారం అందిన 12 నిమిషాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ యూనిట్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతని గురించి వెతుకుతున్న సమయంలో నిందితుడు తనను తాను కాల్చుకున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
"రష్యాలో ఇటీవల జరిగిన ఇలాంటి కేసు"ను చూసి నిందితుడు ప్రేరణ పొందాడని పోలీసు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాపై దర్యాప్తుకు ఆదేశించే అవకాశం ఉంది. గురువారం నాటి చర్యలో ఏ పోలీసు అధికారికి గాయాలు కాలేదని తెలిపారు.
పోలీసులు భవనాన్ని ఖాళీ చేయించారు, వీధికి అడ్డంగా ఉన్న కచేరీ హాల్‌ను నిర్వాసితులకు తాత్కాలిక ఆశ్రయంగా ఉపయోగించారు. 1993లో చెక్ రిపబ్లిక్ స్వతంత్ర రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత జరిగిన అత్యంత దారుణమైన కాల్పులు ఇవి.
చెక్ ప్రెసిడెంట్ పీటర్ పావెల్ మాట్లాడుతూ హింసకు తాను "దిగ్భ్రాంతి చెందాను", "బాధితుల కుటుంబాలు, బంధువులకు హృదయపూర్వక సానుభూతి" వ్యక్తం చేశారు. యూరోపియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ "ఈరోజు అనేక మంది ప్రాణాలను బలిగొన్న కాల్పులు తెలివిలేని హింస"ని ఖండించారు.
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీతో సహా అనేక ఇతర యూరోపియన్ నాయకుల మాదిరిగానే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా చెక్ ప్రజలకు తన "సాలిడారిటీ"ని వ్యక్తం చేశారు. చెక్ ఇంటీరియర్ మినిస్టర్ విట్ రకుసన్ మాట్లాడుతూ, కాల్పులకు, "అంతర్జాతీయ ఉగ్రవాదానికి" మధ్య ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
చెక్ రిపబ్లిక్‌లో సామూహిక తుపాకీ హింస అసాధారణం అయినప్పటికీ, ఇటీవలి సంవత్సరాలలో కొన్ని సంఘటనలు జరిగాయి. 2 ఉహెర్స్కీ బ్రాడ్‌లోని రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి ఏడుగురు పురుషులు, ఒక మహిళను కాల్చి... ఆ తరువాత తనను తాను కాల్చుకున్నాడు.
2019 లో, తూర్పు నగరమైన ఓస్ట్రావాలోని ఆసుపత్రి వెయిటింగ్ రూమ్‌లో ఒక వ్యక్తి ఆరుగురిని చంపాడు, కాల్పుల్లో గాయపడిన మరో మహిళ రోజుల తరువాత మరణించింది. దాడి జరిగిన మూడు గంటల తర్వాత ఆ వ్యక్తి తనను తాను కాల్చుకుని చనిపోయాడు.