సోషల్ మీడియా ఎక్స్ వెబ్ సైట్ డౌన్: నిలిచిన సేవలు
సోషల్ మీడియా ఎక్స్ డౌన్ అయింది. అయితే ఈ విషయాన్ని పలువురు నెటిజన్లు రిపోర్టు చేశారు.ఇవాళ ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇది చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఎక్స్ (X) సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం డౌన్ అయింది. పలువురు నెటిజన్లు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నివెల్లడిస్తున్నారు.
గురువారంనాడు ఉదయం 10:37 గంటల సమయంలో ఎక్స్ సోషల్ మీడియాలో డౌన్ అయింది. ఈ విషయమై 1200 మంది యూజర్లు ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ కు రిపోర్టు చేశారు. గతంలో ఎక్స్ ను ట్విట్టర్ గా పిలిచారు. ఎలన్ మస్క్ ఈ సంస్థను కొనుగోలు చేసిన తర్వాత దీని పేరును ఎక్స్ గా మార్చిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియా ఎక్స్ డౌన్ అయింది. ఈ విషయాన్ని పలువురు నెటిజన్లు ఆ సంస్థకు రిపోర్టు చేశారు. యూజర్ల ప్రొఫైల్స్ లోని వినియోగదారుల పోస్టులు కన్పించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఎక్స్ యూజర్లు ఈ విషయమై ఫిర్యాదులు చేశారు. అర్జెంటీనా, అస్ట్రేలియా, కెనడా, అమెరికా, యూకే నుండి యూజర్లు ఈ విషయమై ఫిర్యాదు చేశారు.
గత ఏడాది అక్టోబర్ మాసంలో ఎలన్ మస్క్ సోషల్ మీడియా ఎక్స్ ను కొనుగోలు చేశారు. ఎలన్ మస్క్ ఎక్స్ ను కొనుగోలు చేసిన తర్వాత తరచుగా ఇలాంటి సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటుంది.
ఈ రకమైన సమస్యలను పరిష్కరించడానికి గంటల సమయం పడుతుంది. సెప్టెంబర్ మాసంలో సోషల్ మీడియా ఎక్స్ పలు సాంకేతిక సమస్యలతో యూజర్లకు ఇబ్బంది కలిగించింది. 24 గంటల సమయంలో ఈ రకమైన సమస్యలు వచ్చాయి. అయితే ఈ సమస్యలకు కారణాలను కంపెనీ మాత్రం వెల్లడించలేదు. సోషల్ మీడియాలో లైవ్ ఆడియో, వీడియోలు అప్ లోడ్ చేసేందుకు అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు.