గ్వాటెమాలాలో బద్దలైన అగ్ని పర్వతం: 69కు చేరిన మృతులు

Guatemala volcano eruption death toll rises to 69
Highlights

విరజిమ్మిన లావా 69 మంది సజీవ దహనం

గ్వాటెమాలా: గ్వాటెమాలాలో  అగ్నిపర్వతం బద్దలై లావాలో చిక్కుకొని సుమారు 69 మంది మృత్యువాత పడ్డారు.  మృత్యుల సంఖ్య పెరిగే అవకాశం  ఉందని అధికారులు
అనుమానిస్తున్నారు. 

గ్వాటెమాలాలో ప్యూగో అగ్నిపర్వతం బద్దలై  లావా ఉప్పెనలా ముంచెత్తింది. గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్ని పర్వతం ఆదివారం నాడు ఒక్కసారిగా లావాను బయటకు వెదజల్లింది.

దీంతో ఆ ప్రాంతమంతా బూడిద, ఎగిసిపడిన లావా  ఆనవాళ్ళు కన్పిస్తున్నాయి.లావా ఎగజిమ్మడంతో  శవాల దిబ్బలు కన్పిస్తున్నాయి.  ఇప్పటికే 65 మృతదేహలను  వెలికితీశారు. ఈః ప్రమాదంలో సుమారు గాయపడిన 40 మంది పరిస్థితి విషమంగా ఉందని  అధికారులు చెబుతున్నారు.


దుమ్ము,ధూళితోనే ప్రజలు ఇంకాఇబ్బందులుపడుతున్నారు.సహాయకచర్యలకు దుమ్ము, ధూళి ఆటంకాన్ని కల్గిస్తున్నాయి. 1974 తర్వాత సంభవించిన అతి పెద్ద ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు.

loader