ఘనాలో మార్బర్గ్ వైరస్‌కు పాజిటివ్ తేలిన ఇద్దరు మరణించారు. వీరికి ఈ నెల మొదట్లో ఈ మరణాలు సంభవించింనట్లు ఘనా అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్ ఎబోలా మాదిరిగానే అత్యంత తీవ్రమైన అంటువ్యాధి అని ఘనా ఆరోగ్య శాఖ తెలిపింది.

ఘనా : ఎబోలా మాదిరిగానే తీవ్ర అంటు వ్యాధి అయిన Marburg virus సోకిన రెండు కేసులను Ghana అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల ప్రారంభంలో మరణించిన ఇద్దరు వ్యక్తులు వైరస్ పాజిటివ్ గా తేలారని.. ఘనా ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. ఘనాలో నిర్వహించిన పరీక్షల్లో జూలై 10న వీరికి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే World Health Organization ప్రకారం, కేసులను మార్బర్గ్ వైరస్ కే చెందినవని ధృవీకరించబడటానికి సెనెగల్‌లోని ప్రయోగశాల ద్వారా ఫలితాలను ధృవీకరించవలసి ఉంది.

"సెనెగల్‌లోని డాకర్‌లోని ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్‌లో తదుపరి పరీక్షలు ఈ ఫలితాలను ధృవీకరించాయి" అని ఘనా హెల్త్ సర్వీస్ (GHS) ఒక ప్రకటనలో తెలిపింది. వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడానికి ఘనా ఆరోగ్య సేవా శాఖ పనిచేస్తోంది. ఈ వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ లో ఉన్న వారందరినీ గుర్తించి.. ఐసోలేషన్ లో ఉంచి.. వారిని పరీక్షించారు. అయితే, వీరిలో ఎవ్వరికీ ఇప్పటివరకు మార్బర్గ్ వైరస్ కు సంబంధించిన ఎటువంటి లక్షణాలూ కనిపించలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది. 

పశ్చిమ ఆఫ్రికాలో మార్బర్గ్‌ వైరస్ సెకండ్ ఔట్ బ్రేక్ ఇది. ఈ ప్రాంతంలో వైరస్ మొట్టమొదటి కేసు గత సంవత్సరం గినియాలో బయటపడింది. ఆ తరువాత ఇంకే కేసులూ నమోదు కాలేదు. కాగా, ‘ఘనా ఆరోగ్య అధికారులు వేగంగా స్పందించారు. సాధ్యమయినంతగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముందస్తుగా సిద్ధమవుతున్నారు. ఇది మంచిది ఎందుకంటే తక్షణ, నిర్ణయాత్మక చర్య లేకపోతే, మార్బర్గ్ వైరస్ తీవ్ర ఫలితాలను ఇస్తుంది’ అని ఆఫ్రికా WHO ప్రాంతీయ డైరెక్టర్ మాట్షిడిసో మొయిటీ అన్నారు.

ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్.. రంగంలోకి డబ్ల్యూహెచ్‌వో

దక్షిణ ఘనాలోని అశాంతి ప్రాంతంలోని ఇద్దరు రోగులకు ఆసుపత్రిలో చనిపోయే ముందు డయేరియా, జ్వరం, వికారం,వాంతులు వంటి లక్షణాలు ఉన్నాయని WHO తెలిపింది. డాకర్, జూలై 17 (రాయిటర్స్) - ఎబోలా మాదిరిగానే అత్యంత అంటు వ్యాధి అయిన మార్బర్గ్ వైరస్ రెండు కేసులను ఘనా అధికారికంగా ధృవీకరించింది, ఈ నెల ప్రారంభంలో మరణించిన ఇద్దరు వ్యక్తులు వైరస్‌ పాజిటివ్ గా తేలారని ఘనా ఆరోగ్య సేవ ఆదివారం తెలిపింది.

1967 నుండి ఇప్పటివరకు డజను మార్బర్గ్ వైరస్ కేసులు బయటపడ్డాయి. అవన్నీ ఎక్కువగా దక్షిణ, తూర్పు ఆఫ్రికాలోనే నమోదయ్యాయి. WHO ప్రకారం, వైరస్ జాతి, కేసు నిర్వహణపై ఆధారపడి మరణాల రేట్లు గత వ్యాప్తిలో 24% నుండి 88% వరకు మారాయి. ఇది పండ్ల గబ్బిలాల నుండి ప్రజలకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తుల శారీరక ద్రవాలు, వారు ముట్టుకున్న ప్రాంతాలను ముట్టుకోవడం.. వాడిన వస్తువులతో.. ప్రత్యక్ష సంబంధం ద్వారా మానవులలో వ్యాపిస్తుంది అని WHO తెలిపింది.