Asianet News TeluguAsianet News Telugu
breaking news image

బ్లూ కాలర్ వర్కర్ నుండి మిలియనీర్‌గా : నేషనల్ బాండ్స్ డ్రాలో భారత ఎలక్ట్రీషన్‌ను వరించిన అదృష్టం 

భారతదేశంలోని గుల్లపల్లి గ్రామానికి చెందిన నాగేంద్రం ఎమిరేట్స్‌లో నివాసముంటున్నాడు. దేశం కాని దేశంలో ఎంతో కష్టపడి చెమట చిందిస్తూ కుటుంబం కోసం డబ్బులు కూడబెడుతున్నాడు. అయితే డబ్బులను పొదుపు చేసే అలవాటే బోరుగడ్డను ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది. నేషనల్ బాండ్స్‌లో సేవింగ్స్‌తో అతడి జీవితమే మారిపోయింది. 

From Blue Collar Worker to Millionaire: Indian Electricity's Fortune in National Bonds Draw GVR
Author
First Published Jun 26, 2024, 2:23 PM IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నివాసముండేవారికి స్పూర్తినిచ్చే కథనమిది. బతుకుదెరువు కోసం ఎమిరేట్స్‌కు వలసపోయిన ఓ భారతీయ కార్మికుడి జీవితం నేషనల్ బాండ్స్‌తో పూర్తిగా మారిపోయింది. ఎమిరేట్స్‌లో నివాసముంటున్న బోరుగడ్డ నాగేంద్రం ఓ ఎలక్ట్రీషన్. అతడు తాజా నేషనల్ బాండ్స్ డ్రాలో విజేతగా నిలిచి ఏకంగా (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్) AED 1 మిలియన్ పొందాడు.

భారతదేశంలోని గుల్లపల్లి గ్రామానికి చెందిన నాగేంద్రం ఎమిరేట్స్‌లో నివాసముంటున్నాడు. దేశం కాని దేశంలో ఎంతో కష్టపడి చెమట చిందిస్తూ కుటుంబం కోసం డబ్బులు కూడబెడుతున్నాడు. అయితే డబ్బులను పొదుపు చేసే అలవాటే బోరుగడ్డను ఇప్పుడు కోటీశ్వరుడిని చేసింది. నేషనల్ బాండ్స్‌లో సేవింగ్స్‌తో అతడి జీవితమే మారిపోయింది. 

2017లో ఎన్నో కలలను మోసుకుంటూ ఎమిరేట్స్‌లో అడుగుపెట్టాడు బోరుగడ్డ  నాగేంద్రం. కుటుంబాన్ని బాగా చూసుకునేందుకు ఎంతో బాధను దిగమింగుకున్నాడు. భార్య, ఇద్దరు బిడ్డలకు (18 ఏళ్ల కూతురు, 14 ఏళ్ల కొడుకు) దూరంగా ఉంటున్నాడు. కష్టపడి పనిచేస్తూ పైసా పైసా పొదుపు చేస్తున్నాడు.  

అయితే 2019 నుండి బోరుగడ్డ సంపాదించిన డబ్బులను నమ్మకమైన నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేయడం ప్రారంభించాడు. అతడు ప్రతినెలా 100 దిర్హమ్ ప్రత్యక్ష బదిలీ ద్వారా పొదుపు చేస్తూ వస్తున్నాడు. ఇలా స్థిరంగా  పొదుపు చేయడమే ఇప్పుడు అతడికి మరుపురాని విజయాన్ని అందించింది. 

బోరుగడ్డ నాగేంద్రం స్టోరీ ఎందరికో ఆదర్శం. ఎన్నో ఆశలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళి కష్టపడి పనిచేసేవారు మెరుగైన జీవితం కోసం డబ్బులు పొదుపుచేయడం అలవాటు చేసుకోవాలి. ఇందులోకి నేషనల్ బాండ్స్ వంటి నమ్మకమైన వాటిని ఉపయోగించుకోవాలి. 

ఆర్థిక భద్రత ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.  ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాకుండా సంపాదించిన దాంట్లో ఎంత పొదుపు చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. అయితే నేషనల్ బాండ్స్ వంటివాటిలో చిన్న మొత్తాలను పొదుపు చేసినా మనకు భారీ రిటర్న్ ఇస్తాయి. కాబట్టి యూఏఈ లో వుండేవారు భవిష్యత్ లో ఆర్థిక వ్యవహారాలపై జాగ్రత్తగా వ్యవహరించడం మంచింది. 

నేషనల్ బాండ్స్ ద్వారా తనకు దక్కిన విజయం పై బోరుగడ్డ హర్ష్యం వ్యక్తం చేసాడు. నిజంగా ఇది తన జీవితంలో మరిచిపోలేని విషయమన్నారు. తన కుటుంబానికి మరింత మెరుగైన జీవితం అందించాలనే తాను ఎమిరేట్స్ కు వచ్చానన్నాడు. తన బిడ్డలకు మంచి విద్య అందించాలని కోరుకున్నానని... అది నిజం కాబోతోందని అన్నారు.  నేషనల్ బాండ్స్ తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తోందని... తద్వారా తన ఆశలన్ని నెరవేరుతున్నాయని బోరుగడ్డ తెలిపారు. 

ఇలా బోరుగడ్డ జీవితంలో నేషనల్ బాండ్స్ కొత్త వెలుగులు నింపింది. బోరుగడ్డ మాదిరిగానే ఏప్రిల్ 2024లో అబ్దుల్లా అలి AED 1 మిలియన్ ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు.  

From Blue Collar Worker to Millionaire: Indian Electricity's Fortune in National Bonds Draw GVR


ఏమిటీ నేషనల్ బాండ్స్..? 

నేషనల్ బాండ్స్ అనేది ప్రజలు డబ్బులు పొదుపు చేసుకునేందుకు లేదా పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ ఏర్పాటుచేసిన సంస్థ. దీన్ని 2006 లో ప్రారంభించారు. ఇది దుబాయ్ ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు పొందిన లైసెన్స్ సంస్థ... అంతేకాదు దీని వ్యవహారాలను ప్రభుత్వ ఆడిట్ సంస్థలు పర్యవేక్షిస్తాయి. షరియా సూపర్వైజరి బోర్డుతో పాటు అంతర్జాతీయ ఆడిటర్స్ నేషనల్ బాండ్స్ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుంటారు. ఈ కంపనీ యూఏఈ వాసులతో పాటు ఇతర దేశాలనుండి వచ్చి నివాసముండే వారికి కూడా ఆర్థిక సేవలు అందిస్తుంది. చిన్నచిన్న పెట్టుబడులు పెట్టేవారికి కూడా చాలా తక్కువ రిస్క్ కలిగిన మంచి రిటర్న్ అందించే ప్రయత్నం చేస్తారు. ప్రజల్లో ఆర్థిక క్రమశిక్షణను పెంచేందుకు ఈ కంపనీ ప్రయత్నిస్తోంది. ఇలా నేషనల్ బాండ్స్ లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రతి నెలా, మూడునెలల ఒకసారి AED 35.5 మిలియన్స్ గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ప్రతినెలా AED 1 మిలియన్ తో పాటు విలాసవంతమైన కార్లను కూడా తమ పొదుపర్లకు అందిస్తోంది నేషనల్ బాండ్స్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios