యూకే మాజీ పీఎం లిజ్ ట్రస్ పర్సనల్ ఫోన్‌ను రష్యా గూఢచారులు హ్యాక్ చేసినట్టు తెలిసింది. ఆమె దేశ విదేశాంగ మంత్రి ఉన్న కాలంలో ఆమె ఫోన్‌ను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన ఏజెంట్లు హ్యాక్ చేసి ఉంటారని డైలీ మెయిల్ ఓ కథనంలో పేర్కొంది. 

న్యూఢిల్లీ: బ్రిటీష్ మాజీ ప్రధానమంత్రి లిజ్ ట్రస్ ఫోన్‌ను రష్యా గూఢచారులు హ్యాక్ చేసినట్టు తెలిసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం పని చేసే కొందరు ఏజెంట్లు ఆమె పర్సనల్ ఫోన్ హ్యాక్ చేసినట్టు డైలీ మెయిల్ శనివారం రిపోర్ట్ చేసింది. ఆమె యూకే విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నప్పుడు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసినట్టు వివరించింది.

తద్వార రష్యా ఏజెంట్లు టాప్ సీక్రెట్ వివరాలను చూడగలిగారని తెలిపింది. అంతర్జాతీయ దేశాలతో సంప్రదింపుల వంటి కీలక విషయాలు సహా ఆమె తన క్లోజ్ ఫ్రెండ్ క్వాసి క్వార్టెంగ్‌తో జరిపిన సంభాషణలనూ ఆ ఏజెంట్లు యాక్సెస్ చేసి ఉంటారని పేర్కొంది. క్వాసి క్వార్టెంగ్ ఆ తర్వాత దేశ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.

కన్జర్వేటివ్ పార్టీ లీడర్షిప్ కోసం జరిగిన క్యాంపెయిన్ సందర్భంలో లిజ్ ట్రస్ పర్సనల్ ఫోన్ హ్యాక్‌కు గురైనట్టు తెలిసినట్టు ఆ కథనం వివరించింది. ఆ క్యాంపెయిన్ తర్వాతే లిజ్ ట్రస్ యూకే పీఎం అయ్యారు.

Also Read: యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా.. బ్రిటన్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం

ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం గురించిన మెస్సేజీలూ అందులో ఉన్నట్టు భావిస్తున్నారు. అంతేకాదు, ఆయుధాల షిప్‌మెంట్ వివరాలూ అందులో ఉన్నట్టు తెలుస్తున్నది.

ఇలాంటి కీలకమైన అంతర్జాతీయ విషయాలే కాదు.. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ ను లిజ్ ట్రస్, క్వాసి క్వార్టెంగ్‌ లు చేసిన విమర్శలు కూడా అందులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మెస్సేజీలు విదేశీయుల చేతిలో పడితో అది బ్లాక్ మెయిల్‌కు దారి తీసి పెద్ద ముప్పుగా పరిణమించే ముప్పు ఉన్నదని ఆ రిపోర్టు తెలిపింది.

కేవలం 44 రోజుల మాత్రం యూకే పీఎంగా లిజ్ ట్రస్ ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభ ముదురుతుండటంతో ఆమె తన రాజీనామా ప్రకటించారు. అత్యంత స్వల్ప కాలం యూకే పీఎంగా సేవలు అందించిన వారిలో లిజ్ ట్రస్ ముందు స్థానంలో ఉన్నారు.