బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది.

బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన 45 రోజుల్లోనే ఆమె తన పదవికి రాజీనామా చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ పనితీరు పట్ల సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు రావడం, ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పడంతో లిజ్ ట్రస్ పదవి నుంచి తప్పుకున్నారు. తద్వారా బ్రిటన్ చరిత్రలో అత్యంత తక్కువ కాలం ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా లిజ్ ట్రస్ రికార్డుల్లోకెక్కారు. మినీ బడ్జెట్‌తో పాటు ఆర్ధిక సంక్షోభం కారణంగా ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా చేసిన నేపథ్యంలో ప్రధాని కూడా తప్పుకోవడం కలకలం రేపింది.