Asianet News TeluguAsianet News Telugu

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూత

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ (96) అనారోగ్య కారణాలతో బుధవారం చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా సంస్థలు ధృవీకరించాయి. 

Former Chinese President Jiang Zemin has passed away
Author
First Published Nov 30, 2022, 3:16 PM IST

చైనా మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ కన్నుమూశారు. లుకేమియా తో పాటు పలు అవయవ వైఫల్యంతో తన 96 ఏళ్ల వయస్సులో బుధవారం మరణించినట్లు చైనా ప్రభుత్వ మీడియా నివేదించింది. జియాంగ్ మధ్యాహ్నం 12:13 గంటలకు (0413 GMT) తన స్వస్థలమైన షాంఘైలో చనిపోయారని అధికారిక జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురి మరణం.. 20 మందికి పైగా గాయాలు..

ఆయన మరణాన్ని ప్రకటిస్తూ పాలక కమ్యూనిస్ట్ పార్టీ.. పార్లమెంట్, క్యాబినెట్, సైన్యం చైనీస్ ప్రజలకు ఒక లేఖను విడుదల చేసింది.‘‘ కామ్రేడ్ జియాంగ్ జెమిన్ మరణం మా పార్టీకి, మా సైన్యానికి, మా అన్ని జాతుల ప్రజలకు పూడ్చలేని లోటు’’ అని లేఖలో పేర్కొంది. ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ ప్రకటన విడుదలైంది.

‘‘ మా ప్రియమైన కామ్రేడ్ జియాంగ్ జెమిన్ ఉన్నత ప్రతిష్ట కలిగిన అత్యుత్తమ నాయకుడు. గొప్ప మార్క్సిస్ట్. రాజనీతిజ్ఞుడు. సైనిక వ్యూహకర్త, దౌత్యవేత్త కమ్యూనిస్ట్ పోరాట యోధుడు ’’ అంటూ ఆ లేఖ అభిర్ణించిందని ‘రాయిటర్స్’ నివేదించింది. 

'శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉన్నాయని తెలియదు. రెండుసార్లు అఫ్తాబ్ ఫ్లాట్‌కి వెళ్లాను'

కాగా.. 1989లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనకారులపై రక్తపాతంతో కూడిన టియానన్మెన్ అణిచివేత తర్వాత జియాంగ్ చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించాడు. దీంతో దేశం దాని తదుపరి దౌత్యపరమైన ఒంటరితనం నుండి బయటపడింది, యునైటెడ్ స్టేట్స్‌తో కంచెలను సరిదిద్దుకుంది. అపూర్వమైన ఆర్థిక వృద్ధిని సాధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios