Asianet News TeluguAsianet News Telugu

పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. ముగ్గురి మరణం.. 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్ లో పోలీసు వాహనాన్ని టార్గెట్ చేసుకుని ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. 

Suicide attack in Pakistan  Three people died.. More than 20 people were injured..
Author
First Published Nov 30, 2022, 2:28 PM IST

పశ్చిమ పాకిస్థాన్‌లో బుధవారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. క్వెట్టాలోని పోలీసు ట్రక్కును లక్ష్యంగా చేసుకుని ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్టు నివేదికలు తెలిపాయి. ఈ దాడికి తాలిబాన్ స్థానిక విభాగం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించింది.

వ్యక్తి కడుపులో 187 నాణేలు.. షాక్ లో డాక్టర్లు..ఇంతకీ ఎలా వెళ్లాయంటే...

అత్యంత ముఖ్యమైన టీటీపీ కమాండర్ తో పాటు మరో 10 మంది ఉగ్రవాదులను భీకర ఎన్ కౌంటర్ లో హతమార్చినట్లు పాకిస్తాన్ భద్రతా దళాలు ప్రకటించిన మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. పాకిస్తాన్ తో వేసవిలో ప్రకటించిన కాల్పుల విరమణకు ముగింపు పలుకుతామని సోమవారం టీటీపీ ప్రకటించింది.

'శ్రద్ధ శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉన్నాయని తెలియదు. రెండుసార్లు అఫ్తాబ్ ఫ్లాట్‌కి వెళ్లాను'

కాగా.. క్వెట్టా నగరంలో పోలియో టీకాలు వేసే వారిని ఎస్కార్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని ఏఎఫ్ పీ ప్రకటించింది. ఈ ఘటనలో మొత్తంగా ముగ్గురు మరణించారు. మృతుల్లో ఓ పోలీసు, ఓ మహిళా, ఓ బాలుడు ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

ఇదిలా ఉండగా.. ఈ దాడికి తామే బాధ్యులమని టీటీపీ ఏఎఫ్ పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. త్వరలోనే ఈ దాడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios