పాకిస్థాన్ లో సంభవించిన ఆకస్మిక వరదలు, భారీ వర్షాల ప్రభావం వల్ల 68 మంది చనిపోయారు. అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కరెంట్ షాక్ లు రావడం వల్ల నలుగురు మరణించారు.
పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కరాచీ నగరం, పొరుగున ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో ఆకస్మికంగా వరదలు సంభవించాయి. ఈ వరదలు, వానల వల్ల దాదాపు 68 మంది చనిపోయారు.
బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా, బర్ఖాన్, పిషిన్, కోహ్లు, బోలన్, లోరెలై మరియు ఝోబ్ ప్రాంతాల్లో 63 మంది మరణించగా, సింధ్ ప్రావిన్స్ రాజధాని కరాచీలో ఐదుగురు చనిపోయారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నగరంలోని అనేకే ప్రాంతాల్లో వరద ముంచెత్తుతోంది. దీంతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదుల్ అజా రెండో రోజున చాలా ప్రాంతాల్లో కరెంటు కోతలు ఏర్పడ్డాయి.
గుజరాత్ పోలీసు ట్విట్టర్ ఖాతా హ్యాక్.. ఎలన్ మస్క్ అకౌంట్‌గా మార్చిన దుండగులు
ఈ వరదల వల్ల కరాచీలోని నలుగురు వ్యక్తులు విద్యుదాఘాతానికి గురయ్యారు. మరొకరు గోడ కూలిపోవడంతో మరణించారని ఓ పోలీసు అధికారి తెలిపారు. బలూచిస్థాన్ హోం మంత్రి మీర్ జియావుల్లా లాంగోవ్ క్వెట్టాలోని సహజ జలమార్గాలపై గృహాలను నిర్మించడమే ప్రావిన్స్‌లో అధిక ప్రాణనష్టానికి కారణమని తెలిపారు. బాధితులలో ఎక్కువ మంది ఈ ప్రాంతాలకు చెందినవారే అని ఆయన చెప్పారు. క్వెట్టా సమీపంలోని లోరెలై నుండి రెస్క్యూ కార్మికులు ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు ధృవీకరించారు.
బలూచిస్తాన్ ప్రావిన్షియల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (PDMA) అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ప్రాణనష్టంతో పాటు వరదలు, భారీ వర్షాల వల్ల ప్రావిన్స్‌లో 50 మందికి పైగా గాయపడ్డాయని చెప్పారు. కుండపోత వర్షాల కారణంగా ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాలలో చెక్ డ్యామ్‌లు, వంతెనలను కూడా కొట్టుకుపోయాయి. ఆఫ్ఘన్ సరిహద్దుకు సమీపంలోని కడాని డ్యామ్‌కు విరిగిపడుతుందనే భయం నెలకొంది. కాగా.. జూలై 18-19 వరకు తట్టా, బాడిన్, హైదరాబాద్, టాండో ముహమ్మద్ ఖాన్, ఉమర్‌కోట్, మిర్‌పుర్‌ఖాస్‌తో పాటు కరాచీతో పాటు సింధ్‌లోని ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే పాకిస్థాన్ వర్షకాలం వరదలు కొత్తేం కాదు. ప్రతీ ఏడాది పాకిస్తాన్ ఈ వార్షిక రుతు పవనాలు వచ్చే సమయంలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. ఈ వరదలను అరికట్టడానికి ప్రభుత్వం దగ్గర సరైన ప్లానింగ్ చేయడం లేదని విమర్శలు ఉన్నాయి.
