సదరు వ్యక్తి కొద్ది రోజుల క్రితం covid 19తో ఆసుపత్రిలో చేరారు. జీనోమ్ పరీక్షలు నిర్వహించగా.. ఒమిక్రాన్ బారిన పడినట్లు నిర్థారించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆ వ్యక్తి మరణించారు. అయితే అతడికి ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

జెరూసలేం : అత్యంత వేగంగా వ్యాపిస్తూ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోన్న కొత్త వేరియంట్ Omicron తో మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే బ్రిటన్, అమెరికాలో ఈ వేరియంట్ మరణాలు నమోదవ్వగా.. తాజాగా ఇజ్రాయెల్ లోనూ First omicron death నమోదయ్యింది. బీర్షబా నగరంలో కొత్త వేరియంట్ కారణంగా ఓ 60 యేళ్ల వక్యక్తి మృతి చెందారు. 

సదరు వ్యక్తి కొద్ది రోజుల క్రితం covid 19తో ఆసుపత్రిలో చేరారు. Genome testingలు నిర్వహించగా.. ఒమిక్రాన్ బారిన పడినట్లు నిర్థారించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఆ వ్యక్తి మరణించారు. అయితే అతడికి ఇప్పటికే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కానీ పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

నాలుగో డోసుకు సిఫార్సులు..
ఇదిలా ఉండగా, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో మరో బూస్టర్ డోసు పంపిణీ కోసం ఇజ్రాయెట్ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. 60 యేళ్లే పై బడినవారికి నాలుగో డోసు ఇవ్వాలని ఆ దేశ నిపుణుల కమిటీ సిఫార్లు చేసింది. ఈ సిఫార్సులపై ప్రధాని నఫ్తాలి బెన్నెట్ సానుకూలంగా స్పందించారు. ఒమిక్రాన్ నుంచి బయటపడేందుకు ఇదే సరైన మార్గమని అన్నారు. 

అర్హులైన వారంతా సమయం వృథా చేయకుండా నాలుగో డోసు వేయించుకోవాలని కోరారు. అయితే దీని మీద దేశ ఆరోగ్య శాఖ నుంచి ఇంకా అదికారిక అనుమతులు రాలేదు. ఆ అనుమతులు వచ్చిన వెంటనే.. 60 యేళ్లు పై బడిన వారికి నాలుగో డోసు పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు కనీసం 350 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. అమెరికా సహా జర్మనీ, ఇటలీ, టర్కీ, కెనడా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించింది. 

ఒమిక్రాన్‌ అందరి ఇళ్లకు చేరుతుంది.. బహుశా చెత్త దశను చూడొచ్చు.. బిల్‌గేట్స్ హెచ్చరిక

ఇదిలా ఉండగా, బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో ఇప్పటివరకు 12 మంది మృతిచెందగా, 104 మంది ఆస్పత్రిలో చేరారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు భారీగానే నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాలో తొలి Omicron Death మంగళవారం నమోదైంది. టెక్సాస్ రాష్ట్రం హర్రిస్ కౌంటీలో సోమవారం ఓ వ్యక్తి ఒమిక్రాన్‌తో చనిపోయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ మృతిచెందిన వ్యక్తి వయసు 50 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని ఆరోగ్యశాఖ పేర్కొంది. 

అయితే ఆ వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకోలేదని, గతంలో కోవిడ్ బారినపడ్డారని తెలిపింది. ఆ వ్యక్తికి ఒమిక్రాన్ సోకడంతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టుగా చెప్పింది. దీనిపై యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) మాత్రం స్పందించలేదు. మరోవైపు హారిస్‌ కౌంటీ న్యాయమూర్తి Lina Hidalgo యూఎస్‌లో ఒమిక్రాన్ తొలి మృతిపై విచారణం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు.

యూఎస్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో.. ఇతర వేరియంట్‌ల కంటే ఒమిక్రాన్‌వే అధికంగా ఉన్నాయని సీడీసీ సోమవారం తెలిపింది. యూఎస్‌లో గత వారం రోజుల్లో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్‌లలో 73 శాతం ఒమైక్రాన్ వేరియంట్‌వేనని పేర్కొంది.