ప్రపంచాన్నంతా వణికిస్తున్న మహమ్మారి ప్రస్తుతానికి ఏదన్నా ఉందంటే అది కరోనా వైరసే! చైనాలోని వుహాన్ నగర కేంద్రంగా బయటపడ్డ వైరస్ ఇప్పుడు యావత్ చైనాతో పాటు పూర్తి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. 

ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే దాదాపుగా 720 మంది చనిపోయినట్టు చైనా అధికారికంగా ధృవీకరించింది. ఒక 30వేల మంది వరకు ఈ వ్యాధి బారినపడి చికిత్సపొందుతున్నట్టు అనధికారిక సమాచారం. 

Also read: భారత ధర్మం అంటే ఇదే: కరోనా వైరస్ భయపెడుతున్న వేళ... శత్రు దేశమైన పాక్ కి కూడా సాయం

ఇప్పటివరకు ఈ వ్యాధి వల్ల చైనాకి తోడుగా ఫిలిప్పీన్స్, హాంగ్ కాంగ్ లలో మాత్రమే మరణాలు నమోదయ్యాయి. దాదాపుగా 24 దేశాలకు ఈ కరోనా వైరస్ వ్యాపించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

ఇక తాజాగా చైనాలో అమెరికాకు చెందిన ఒక 60 ఏళ్ళ ముసలాయన మరణించాడు. దీనితో అమెరికాకు చెందిన తొలి వ్యక్తి కరోనా వైరస్ బారిన పడి మృతి చెందినట్టు అమెరికన్ ఎంబసీ ధృవీకరించింది. 

ఇకపోతే... కరోనా సోకినా వ్యక్తులు ఉండడం వల్ల నది సంద్రంలో ఆపేసిన జపాన్‌‌కి చెందిన క్రూయిజ్ నౌకలో మరో ముగ్గురికి కూడా తాజాగా కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తోంది. 

ఇలా నౌకలో ఈ కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 64కి చేరింది. తాజాగా వైరస్ సోకిన ముగ్గురిలో ఇద్దరు అమెరికా దేశ పౌరులేనని తేలింది. అందువల్ల ఆ నౌకలో వైరస్ సోకిన అమెరికన్ల సంఖ్య ఇప్పుడు 13కి చేరుకుంది. 

Also read: కరోనా వైరస్ దెబ్బతో ఐఫోన్ల తయారీ ఆపేసి మాస్కులు తయారు చేస్తున్నారు...

ఆ నౌకలో ఇప్పటివరకూ జపాన్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, అమెరికా దేశాలకు చెందిన వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తుంది. మొత్తం 3700 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు. 

వైరస్ సోకినా వారికోసం ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షలు చేస్తూనే ఉన్నారు. వైరస్ సోకినట్లు తేలిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ నౌకను జపాన్‌ లోని యొకొహామా దగ్గర నిలిపివేశారు. దాదాపుగా మరో పది రోజులపాటు, అంటే ఫిబ్రవరి 19 వరకూ నౌక అక్కడే ఉండనున్నట్టు తెలుస్తోంది.