Asianet News TeluguAsianet News Telugu

చైనాలోని జిన్జియాంగ్ లో అగ్నిప్రమాదం.. 10 మంది సజీవ దహనం.. 9 మందికి గాయాలు

చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

Fire in Xinjiang, China.. 10 people were burnt alive.. 9 people were injured
Author
First Published Nov 25, 2022, 11:51 AM IST

వాయువ్య చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనం అయ్యారు. మరో 9 మంది గాయపడ్డారు. గురువారం రాత్రి ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకురావడానికి దాదాపు 3 గంటల సమయం పట్టింది. 

రష్యాలో దారుణం.. క్రిమ్స్క్ లో నగరంలో ముగ్గురిని కాల్చి చంపి.. అనంతరం ఆత్మహత్య చేసుకున్న దుండగుడు

ఈ ఘటనలో గాయపడిన వారిని ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తరలించారు. అయితే క్షతగాత్రులంతా ప్రాణాలతో బయటపడతారని ప్రభుత్వం తెలిపింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. మధ్య చైనాలోని ఓ పారిశ్రామిక వాణిజ్య సంస్థలో జరిగిన అగ్నిప్రమాదంలో 38 మంది మరణించిన కొన్ని రోజుల తరువాత ఈ విషాదం చోటు చేసుకుంది.

ఆ ఘటనకు కారణమైన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేలవమైన మౌలిక సదుపాయాలు, భద్రతాపై అవగాహన లేకపోవడం, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇటీవల కాలంలో చైనాలో అగ్నిప్రమాదాలు, పేళ్లులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే కోవిడ్ -19 వ్యాప్తితో పోరాడుతున్న చైనాకు ఈ ప్రమాదాలు మరింత ఇబ్బందిని తెచ్చిపెడుతున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ తొలగించిన అధికారికి పాక్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయన ప్రత్యేకతేంటీ ?

చైనాలోని టియాంజిన్ పోర్ట్‌లోని ఒక గోదాంలో 2015 ఆగష్టులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 170 మందికి పైగా మరణించారు. 700 మంది గాయపడ్డారు. ఈ గోదాంలో 700 టన్నుల సోడియం సైనైడ్‌తో పాటు పెద్ద మొత్తంలో విష రసాయనాలు నిల్వ చేసి ఉంచడమే ఈ ప్రమాదానికి కారణమని దర్యాప్తులో తేలింది. 

Follow Us:
Download App:
  • android
  • ios