రష్యాలోని క్రిమ్స్క్ నగరంలో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. బాధితుడిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. 

రష్యాలో ఓ దుండగుడు దారుణానికి ఒడిగట్టాడు. క్రిమ్స్క్ నగరంలో గురువారం ఓ 66 ఏళ్ల వ్యక్తి ముగ్గురిని కాల్చి చంపాడు. అనంతరం అతడూ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. బాధితుల్లో కనీసం ఇద్దరు దుండగుడికి తెలిసిన వారని, రష్యాలోని ప్రధాన నేరాలను విచారించే ఇన్వెస్టిగేటివ్ కమిటీ లోకల్ బ్రాంచ్ సోషల్ మీడియాలో పేర్కొంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అక్కడ కారు పార్క్ చేయాలంటే.. కోట్ల రూపాయలు పెట్టాల్సిందే..

అయితే ఇందులో చనిపోయిన ఇద్దరికి, దుండగుడికి వ్యక్తిగత శత్రుత్వం ఉందని తెలుస్తోంది. మూడో వ్యక్తి ఎవరనేది మాత్రం ఇంకా తెలియరావడం లేదు. గాయపడిన మరో 66 ఏళ్ల వ్యక్తిని పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.

సింహం పై దాడి చేసిన దున్నపోతుల గుంపు... వీడియో వైరల్...!

కాగా.. దుండుగుడు ఓ వీధిలో వెళ్తూ కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియో చివరిలో అతడు నేలపై పడి ఉన్న ఓ వ్యక్తిపై దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై ప్రాంతీయ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి అలెగ్జాండర్ రునోవ్ మాట్లాడుతూ.. స్థానిక వైద్య కేంద్రంలో ఇద్దరు ఉద్యోగులను ఓ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడని తెలిపారు. అతడు బయటకు వెళ్లి ఓ బాటసారిని కూడా హతమార్చాడని చెప్పారు. మరో వ్యక్తికి గాయాలయ్యాయని, అతడిని చికిత్స కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లాడని చెప్పారు.

Scroll to load tweet…

క్రిమ్స్క్ రష్యా యొక్క దక్షిణ క్రాస్నోడార్ ప్రాంతంలో క్రిమియన్ ద్వీపకల్పానికి సమీపంలో ఉన్న ఒక చిన్న నగరం, దీనిని రష్యా ఏకపక్షంగా 2014లో ఉక్రెయిన్ నుండి కలుపుకుంది.