సెనెగల్ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ పని తీరు రోజు రోజుకు దిగజారిపోతోంది. హాస్పిటల్ లో సరైన సమయంలో వైద్యం అందక గర్భిణీ చనిపోయిన ఘటన మరవకముందే తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. గవర్నమెంట్ హాస్పిటల్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో 11 మంది శిశువులు మరణించారు. 

వెస్ట్ ఆఫ్రికాలోని సెన‌గ‌ల్ దేశంలో ఘోరం జ‌రిగింది. ఆ దేశంలోని వెస్ట్ సిటీ టివానేలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌ను ఆ దేశ అధ్యక్షుడు మాకీ సాల్ బుధవారం రాత్రి ప్ర‌క‌టించారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో హాస్పిట‌ల్ లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 11 మంది చిన్నారులు ద‌హ‌నం అయ్యార‌ని తెలిపారు. 

‘‘ ప్రభుత్వ ఆసుపత్రిలోని నియోనాటల్ విభాగంలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది నవజాత శిశువులు మరణించిన బాధకరమైన వార్త నేను ఇప్పుడు తెలుసుకున్నాను ’’ అని ఆయ‌న ట్వీట్ చేశారు. ‘‘వారి త‌ల్లిదండ్రుల‌కు, వారి కుటుంబ స‌భ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని సాల్ పేర్కొన్నారు. 

Kabul: మరోమారు రక్తమోడిన కాబుల్ .. ప‌లు చోట్ల పేలుళ్లు... ఐదుగురిమృతి

రవాణా కేంద్రం టివానేలోని మామే అబ్దౌ అజీజ్ సై దబాఖ్ ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుందని, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని సెనెగల్ రాజకీయ నాయకుడు డియోప్ సై తెలిపారు. మంటలు చాలా త్వరగా వ్యాపించాయని ఆయ‌న చెప్పారు. కాగా నగర మేయర్ డెంబా డియోప్ ముగ్గురు శిశువులను రక్షించార‌ని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన మామే అబ్దౌ అజీజ్ సై దబాఖ్ హాస్పిటల్ ను కొత్త ప్రారంభించార‌ని స్థానిక మీడియా పేర్కొంది. 

ఏప్రిల్ చివరిలో ఇదే దేశంలో ఉత్తర పట్టణమైన లింగ్యూర్ లో ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. హాస్పిట‌ల్ లో మంట‌లు చెలరేగి నలుగురు నవజాత శిశువులు మరణించారు. ప్రసూతి వార్డులోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ లో విద్యుత్ లోపం కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగిందని ఆ న‌గ‌ర మేయ‌ర్ తెలిపారు. 

20లక్షలు దోచుకుని.. ‘ఐలవ్ యూ’ అని రాసిపెట్టి.. ఓ దొంగ వింత చేష్ట..

కాగా సిజేరియన్ కోసం వెయిట్ చేసి స‌కాలం వైద్యం అంద‌క గ‌ర్భిణీ మ‌ర‌ణించిన ఒక నెల రోజుల త‌రువాత తాజాగా బుధ‌వారం అబ్దౌ అజీజ్ సై దబాఖ్ హాస్పిటల్ లో ఈ అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. గర్భిణీ స్త్రీ మరణవార్తతో దేశం మొత్తం క‌ల‌క‌లం సృష్టించింది. ఏప్రిల్ నెల ప్రారంభంలో ఓ గ‌ర్బిణీ సిజేరియన్ కోసం వాయువ్య పట్టణమైన లౌగాలోని గ‌వ‌ర్న‌మెంట్ హాస్పిట‌ల్ చేరింది. అయితే ఆమెకు డాక్ట‌ర్లు ఎవ‌రూ స‌రైన టైంలో ట్రీట్ మెంట్ అందించ‌లేదు. దీంతో ఆమె చ‌నిపోయింది. ఈ ఘ‌ట‌న సెనెగల్ దేశంలో ప్రజారోగ్య వ్యవస్థ ఎలాటి దుస్థితిలో ఉందో తెలియ‌జేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌ను చెల‌రేగాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేయడంలో విఫలమైనందుకు ముగ్గురికి మే 11వ తేదీన లౌగా హైకోర్టు ఆరు నెలల సస్పెండ్ చేసి, జైలు శిక్ష విధించింది. మ‌రో ముగ్గురిని నిర్దోషులుగా కోర్టు విడుద‌ల చేసింది.