గోవాలో ఓ చిలిపి దొంగ.. డబ్బు, నగదు దోచుకుని.. ఇంటి యజమానికి ‘ఐ లవ్ యూ’ అని రాసిపెట్టి వెళ్లాడు. అంత సొమ్ము తన గురించి ఇంట్లో పెట్టినందుకు అలా రాశాడా? ఏమో మరి స్టోరీ చూడండి..

గోవా : చిన్నా, చితకా దొంగల్ని పక్కన పెడితే ప్రొఫెషనల్ దొంగలు పలురకాలు. వారికి అనేక రకాల సెంటిమెంట్లు కూడా ఉంటాయి. అవి ఒక్కోసారి విచిత్రంగా కనిపిస్తాయి. లాజిక్ కు అందవు అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం చిత్రంగా.. ఇంకా చెప్పాలంటే అరికాలిమంట నషాళానికి ఎక్కేలా ఉంటాయి. అలాంటి ఘటనే గోవాలో ఒకటి జరిగింది. 

goaలో అసాధారణ రీతిలో జరిగిన చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాటిక్ గా జరిగిన ఈ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయం చూసి Bangla తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ. 20 లక్షల విలువచేసే ఆభరణాలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఓ Messageని రాసిపెట్టి వెళ్లారు. ఇప్పుడు అదే viralగా మారింది. ఈ ఘటన దక్షిణ గోవాలోని మార్గోవ్ లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆసిబ్ జెక్ అనే వ్యక్తి రెండు రోజులు హాలిడే కోసం బయటకు వెళ్లి మంగళవారం వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూసే సరికి 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆవరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు. అంతేకాకుండా.. ఇంట్లో టీవీ స్క్రీన్ పై ‘ఐ లవ్ యు’ అని మార్కర్ తో రాసి ఉంది. మొదట అది ఏంటో అనుకున్నాడు. ఆ తరువాత కానీ అర్థం కాలేదు. అది గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా కంగు తిన్నాడు. వెంటనే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సచిన్ నర్వేకర్ తెలిపారు.

ఇదిలా ఉండగా, ఇలాంటిదే మరో ఘటన..ఏప్రిల్ 20న ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో ప్రాంతంలో ఓ విచిత్ర చోరీ జ‌రిగింది. అన్షు సింగ్ అనే వ్య‌క్తికి ఈ చందౌలీ మార్కెట్ లో ఓ హార్డ్‌వేర్ దుకాణం ఉంది. అయితే ఏప్రిల్ 16వ తేదీన తెల్ల‌వారుజామున ఈ హార్డ్‌వేర్ దుకాణాన్ని దోచుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ దొంగ అందులోకి చొర‌బ‌డ్డాడు. ముందుగా క్యాష్ కౌంటర్‌లో దొరికినవాటిని తీసుకున్నాడు. ఆ త‌రువాత అటూ, ఇటూ తిరిగాడు. ఆ స‌మ‌యంలో అత‌డు దుకాణంలో అమర్చిన సీసీ కెమెరాను గమనించాడు. అంతే ఆ సీసీ కెమెరా చూసి అత‌డు భ‌య‌ప‌డలేదు స‌రిక‌దా ఆనందంగా డ్యాన్స్ చేశాడు. కొద్ది సేపు ఫుల్ జోష్ లో స్టెప్పులేశాడు. 

దొంగ‌త‌నం చేసిన తరువాత ఇలా ఎందుకు డ్యాన్స్ చేశాడో అత‌డికి మాత్రమే తెలుసు. డ్యాన్స్ చేస్తున్న స‌మ‌యంలో, చోరీ చేసిన స‌మ‌యంలో అత‌డు త‌న ముఖాన్ని గుడ్డతో చుట్టేసుకున్నాడు. దీంతో ఆ దొంగ‌ను గుర్తుప‌ట్ట‌డం చాలా క‌ష్టంగా మారింది. ఆ డ్యాన్స్ చేస్తున్న ఊపులోనే ఆ షాప్ లో నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఈ దృశ్యాల‌న్నీ ఆ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఫుటేజ్ బ‌య‌ట‌కు రావ‌డంతో ఇది ప్ర‌స్తుతం వైర‌ల్ మారింది.