Asianet News TeluguAsianet News Telugu

దక్షిణ చైనాలోని బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం..16 మంది మృతి...

దక్షిణ చైనాలోని బొగ్గు గనిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకోవడంతో దాంట్లో చిక్కుకుని మృతి చెందినట్లు తేలింది. 

fire accident in a coal mine in South China, 16 people died - bsb
Author
First Published Sep 25, 2023, 2:45 PM IST

చైనా : దక్షిణ చైనాలోని పాంఝౌ నగరం గుయిజౌ ప్రావిన్స్ లోనో ఓ బొగ్గుగనిలో ఘోర అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కన్వేయర్ బెల్టులో చిక్కుకుని 16 మంది మృతి చెందారు. కన్వేయర్ బెల్ట్‌కు మంటలు అంటుకోవడంతో.. అందులో చిక్కుకున్న 16 మంది మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

గుయిజౌ ప్రావిన్స్‌లోని పంగువాన్ పట్టణంలోని షాంజియావోషు బొగ్గు గనిలో ఈ మంటలు చెలరేగాయి.కన్వేయర్ బెల్ట్‌లో మంటలు చెలరేగడంతో ఇన్ని మరణాలు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో సూచించినట్లు పంఝౌ నగర ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేసే చైనా, దాని పవన, సౌర విద్యుత్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించినప్పటికీ విద్యుత్ కోసం బొగ్గుపై ఎక్కువగా ఆధారపడుతోంది. దేశంలోని బొగ్గు గనుల పరిశ్రమ ఇటీవలి సంవత్సరాలలో కార్మికులకు భద్రతా పరిస్థితులను మెరుగుపరిచింది, అయితే మరణాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

పంజియాంగ్ కంపెనీకి మొత్తం 7 బొగ్గు గనులని నిర్వహిస్తోందని మొత్తంగా 17.3 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అన్నారు. షాంఘైలోని కమొడిటీస్ కన్సల్టెన్సీ మిస్టీల్ ఒకరోజు పాటు పాంఝౌ లోని అన్ని బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుయిజౌకు చెందిన బొగ్గుగని భద్రతా విభాగం ప్రమాదం గురించి తమకు సమాచారం లేదని తెలిపింది. 

భారత్ తో సంబంధాలు మాకు చాలా కీలకం - కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్

Follow Us:
Download App:
  • android
  • ios