Asianet News TeluguAsianet News Telugu

ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం.. 1,100 మంది మృతి..

హమాస్ మిలిటెంట్లు జరిపిన ఆకస్మిక దాడిపై ఇజ్రాయెలో ధీటుగా స్పందించింది. ఆ దళాలపై యుద్ధానికి పిలుపునిచ్చింది. దీంతో ఇజ్రాయిల్ దళాలు హమాస్ లపై తిరగబడుతున్నాయి. దీంతో రెండు దళాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది.

Fierce war between Israeli forces and Hamas militants.. 1,100 dead..ISR
Author
First Published Oct 9, 2023, 11:46 AM IST | Last Updated Oct 9, 2023, 11:46 AM IST

ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. గాజా నుంచి ఆకస్మికంగా చొరబడిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పై ఇజ్రాయెల్ ఆదివారం యుద్ధం ప్రకటించడంతో తీవ్ర ప్రాణం నష్టం వాటిళ్లుతోంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ఘర్షణలో ఇప్పటికే ఇరువైపులా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఇజ్రాయెల్ కు చెందిన 44 మంది సైనికులతో సహా 700 మందికి పైగా మరణించారు.

వనస్థలిపురంలో దారుణం.. భార్యపై అనుమానంతో నడిరోడ్డుపై హతమార్చిన భర్త.. పోలీసుల అదుపులో నిందితుడు..

ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల గాజాలో కనీసం 413 మంది మరణించినట్లు అధికారులు నివేదించారు. అయితే హమాస్ కూడా ఇజ్రాయెల్ పై వేలాది రాకెట్ల వర్షం కురిపించి పౌరులను కాల్చి చంపి కనీసం 100 మందిని బందీలుగా పట్టుకుంది. ఇదిలా ఉండగా.. హమాస్ దాడికి గురైన మ్యూజిక్ ఫెస్టివల్ నుంచి తమ పారామెడికల్ సిబ్బంది 260 మృతదేహాలను వెలికితీసినట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ జాకా తెలిపింది.

భీకర యుద్ధం.. ఇజ్రాయెల్ లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయలు..

కాగా.. హమాస్ దాడిని ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలోని పలువురు సభ్యులు ఆదివారం ఖండించగా.. ఏకాభిప్రాయం కుదరకపోవడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. అత్యవసర సమావేశంలో అమెరికా, ఇజ్రాయెల్ రెండూ పాలస్తీనా ఇస్లామిస్టులను తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చాయి. హమాస్ చేసిన ఈ ఉగ్రదాడి నేపథ్యంలో ఇజ్రాయెల్ కు అదనపు మద్దతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహక నౌక, యుద్ధనౌకల సమూహాన్ని తూర్పు మధ్యధరా ప్రాంతానికి ఆదేశించారు. వాషింగ్టన్ ఈ ప్రాంతంలో యుద్ధ విమాన స్క్వాడ్రన్లను పెంచుతోందని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడులను నిర్వహించడంలో ఇరాన్ పాత్ర ఉందని హమాస్, హిజ్బుల్లా సీనియర్ సభ్యులు ఆరోపించారు. ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్ జీసీ) అధికారులు, గాజా, హిజ్బుల్లాలోని హమాస్ సహా నాలుగు ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపుల ప్రతినిధులు బీరుట్ లో జరిగిన పలు సమావేశాల్లో ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. గాజా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో పాలస్తీనా కుటుంబానికి చెందిన 19 మంది మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు గాజాలోని 800కు పైగా లక్ష్యాలను ఛేదించిందని, వైమానిక దాడులతో సహా బెయిట్ హనౌన్ పట్టణంలోని చాలా భాగాన్ని నేలమట్టం చేసిందని ఆ దేశ సైన్యం తెలిపింది.

అసెంబ్లీ బరిలో బీజేపీ సీనియర్లు.. కరీంనగర్ నుంచి బండి, కోరుట్ల నుంచి అర్వింద్ !

గాజా స్ట్రిప్ లో అపహరణకు గురైన 30 మందికి పైగా ఇజ్రాయెలీలను తమ వర్గం బందీలుగా ఉంచిందని ఇస్లామిక్ జిహాద్ చీఫ్ జియాద్ అల్-నఖలా ఆదివారం చెప్పారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వేలాది మంది పాలస్తీనియన్లను ప్రస్తావిస్తూ "మా ఖైదీలందరినీ విడుదల చేసే వరకు" బందీలను వెనక్కి పంపబోమని అల్-నఖలా అన్నారు. కాగా.. హమాస్ తన అపూర్వ దాడిని ప్రారంభించి 24 గంటలు దాటినా, ఇజ్రాయెల్ దళాలు సోమవారం అనేక ప్రాంతాల్లో తలదాచుకున్న ఉగ్రవాదులతో పోరాడుతున్నాయి. రోడ్లపై, పట్టణ కేంద్రాల్లో పౌరుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దక్షిణ ప్రాంతంలో హమాస్ ఫైటర్లతో పోరాడటానికి పదుల సంఖ్యలో ఇజ్రాయెల్ దళాలను మోహరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios