Asianet News TeluguAsianet News Telugu

పాక్ న్యూక్లియర్ బాంబ్ పితామహుడి మృతి.. పాకిస్తాన్‌కు నేషనల్ హీరో.. పాశ్చాత్యులకు విలన్

పాకిస్తాన్‌ను న్యూక్లియర్ దేశంగా మార్చడంలో కీలకంగా వ్యవహరించిన, పాక్ న్యూక్లియర్ బాంబ్ పితామహుడిగా కొలిచే అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఆదివారం కొవిడ్‌తో మరణించారు. పాకిస్తాన్ ఆయనను హీరోగా కొలుస్తుండగా పాశ్చాత్య దేశాలు మాత్రం అంతర్జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టిన వ్యక్తిగా చూసింది.
 

father of pakistan nuclear bomb AQ Khan died
Author
New Delhi, First Published Oct 10, 2021, 7:13 PM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ప్రొగ్రామ్ పితామహుడిగా ఆ దేశవాసులు కొలిచే అబ్దుల్ ఖదీర్ ఖాన్(85) ఇస్లామాబాద్‌లోని ఓ హాస్పిటల్ మరణించాడు. ఆదివారం ఉదయం ఆయన కరోనాతో మరణించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇస్లామాబాద్‌లోని ఫైజల్ మసీదులో ఆయనకు అంతిమ క్రియలు అధికారికంగా నిర్వహించారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఇతర ప్రముఖులు అంతిమ సంస్కారాలకు వెళ్లారు. 

Pakistan.. ఒక నేషనల్ ఐకాన్‌ను కల్పోయిందని ప్రధాని Imran khan అన్నారు. తమ దేశాన్ని న్యూక్లియర్ దేశంగా మార్చి, దీటైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కృషి చేసిన ఏక్యూ ఖాన్‌ను జాతి ప్రేమిస్తున్నదని ట్వీట్ చేశారు.

పాకిస్తాన్‌ను తొలి ఇస్లామిక్ న్యూక్లియర్ పవర్‌గా నిలపడంలో ఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఇస్లామాబాద్ సమీపంలోని కహుతాలో nuclear ప్లాంట్ ఏర్పాటు చేయడంలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాతే పాకిస్తాన్ 1998లో తొలి న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించింది. దీంతో న్యూక్లియర్ పవర్ కలిగిన ఏడో దేశంగా పాకిస్తాన్ ఆవిర్భవించింది.

Also Read: భారత్‌తో సరిహద్దును పర్యవేక్షించే చైనా కమాండ్‌లోకి పాకిస్తాన్ ఆర్మీ అధికారులు.. నిఘా వర్గాల వెల్లడి

పాకిస్తాన్ ఆయనను న్యూక్లియర్ బాంబ్ పితామహుడిగా కొలుస్తున్నప్పటికీ పాశ్చాత్య దేశాలు మాత్రం ఆయనను ఒక విలన్‌గానే చూశాయి. ఆయన న్యూక్లియర్ టెక్నాలజీని ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా సహా పలుదేశాలకు అక్రమంగా చేరవేసి అవి న్యూక్లియర్ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి ఉపకరించారని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తాయి. న్యూక్లియర్ టెక్నాలజీని అక్రమంగా ఆ దేశాలతో పంచుకున్నారని ఆగ్రహించాయి.

ఇరాన్, లిబియా, ఉత్తర కొరియాలకు అక్రమంగా న్యూక్లియర్ టెక్నాలజీని చేరవేసినట్టు 2004లో అబ్దుల్ ఖదీర్ ఖాన్ ఓ టెలివిజన్ ప్రోగ్రామ్‌లో స్వయంగా అంగీకరించారు. అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఆయనను వెంటనే క్షమించారు. ఆయనకు శిక్షగా 2004 నుంచి 2009 వరకు గృహనిర్బంధం విధించారు. ఆ తర్వాత ఆయన విడుదలై విదేశాలకు విరివిగా తిరిగారు. ఈ సమయంలోనూ న్యూక్లియర్ టెక్నాలజీని దేశాలకు చేరవేశాడని ఆరోపణలున్నాయి. ఖాన్ చర్యలు అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారాయని అమెరికా రక్షణ శాఖ గతంలోనే ఆగ్రహించింది.

Follow Us:
Download App:
  • android
  • ios