Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ వివాదాల్లోకి ఫేస్ బుక్... రూ.515 కోట్ల భారీ జరిమానా..!

 ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని  హెచ్చరిక  పంపించాలన్న విధానాల మేరకు  ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.   యూనిమేటెడ్ సంస్థ జిఫీని  గత ఏడాది ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అయితే, giphy కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్బుక్ నియంత్రిస్తోంది ఆరోపణలపై  బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అధారిటీ  విచారణ చేపట్టింది.  
 

Facebook fined a record rs.515 crores by UK competition watchdog
Author
Hyderabad, First Published Oct 21, 2021, 7:51 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

లండన్ :  ప్రముఖ Social media Platform ఫేస్ బుక్ బ్రిటన్ కాంపిటీషన్ రెగ్యులేటరీ భారీ జరిమానా విధించింది.  తాము అడిగిన వివరాలు సమర్పించడం ఫేస్ బుక్ నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించిందని,  అందుకే రూ. 515 కోట్లు.. అంటే  దాదాపు 50.5 మిలియన్ పౌండ్లు Fine చెల్లించాలని ఆదేశించినట్లు తెలిపింది. 

 ఏ కంపెనీ అయినా చట్టానికి లోబడి ఉండాల్సిందేనని  హెచ్చరిక  పంపించాలన్న విధానాల మేరకు  ఈ జరిమానా విధించినట్లు పేర్కొంది.   యూనిమేటెడ్ సంస్థ జిఫీని  గత ఏడాది ఫేస్బుక్ కొనుగోలు చేసింది. అయితే, giphy కొనుగోలు ద్వారా సామాజిక మాధ్యమాల మధ్య పోటీని ఫేస్బుక్ నియంత్రిస్తోంది ఆరోపణలపై  బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అధారిటీ  విచారణ చేపట్టింది.  

ఈ వ్యవహారంలో వివరాలు ఇవ్వాలని కోరిన వాటిని సమర్పించడంలో ఫేస్ బుక్ ఉద్దేశపూర్వకంగానే వెనకడుగు వేసిందని CMA పేర్కొంది. మరోవైపు  సీఎంఏ నిర్ణయంపై facebook స్పందించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. సీఎంఏ  నిర్ణయంపై సమీక్షించి తదుపరి అవకాశాలను పరిశీలిస్తామని తెలిపింది.

కాగా, ఈ నెల ప్రారంభం నుంచి ఫేస్ బుక్ ఏదో రకంగా వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ అక్టోబర్ 9న మరోసారి తమ యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది. ఒకే వారంలో రెండు సార్లు ఫేస్ బుక్ సేవలకు అంతరాయం కలిగింది. 

ఈ నేపథ్యంలో.. ఫేస్ బుక్ తమ యూజర్లకు మరోసారి క్షమాపణలు చెప్పింది. ఇటీవల ఫేస్ బుక్, ఇన్ స్ట్రామ్ లు కొన్ని గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఇలాంటి సంఘటన అక్టోబర్ 8న కూడా చోటుచేసుకుంది.

శుక్రవారం సైతం కొంత సేపు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ లు పనిచేయలేదు. వాటి సేవలకు అంతరాయం కలిగింది. చాలా మంది వాటిని యాక్సెస్ చేసుకోలేకపోయారు. దీంతో.. ఫేస్ బుక్ ఈ ఘటనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. శుక్రవారం దాదాపు రెండు గంటలపాటు Facebook, Instagramసేవలకు అంతరాయం కలిగిందని.. వాటిని యాక్సెస్ చేసుకోలేక ఇబ్బంది పడిన యూజర్లకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.

కొందరు ఆ రోజు తమ ఫేస్ బుక్ మెసెంజర్ లో మెసేజ్ లు చేయలేకపోయారని.. కొందరు ఇన్ స్టాగ్రామ్ లో ఫీడ్ లు లోడ్ చేయలేకపోయారనే ఫిర్యాదులు అందాయని చెప్పారు. కేవలం ఒకే వారంలో ఇలా రెండు సార్లు జరగడం పట్ల తాము చింతిస్తున్నట్లు చెప్పారు. 

ఇదిలా ఉండగా.. ఈ వారం మొదట్లో అక్టోబర్ 4 సోమవారం దాదాపు 7గంటల పాటు ఫేస్ బుక్ పని చేయలేదు.  భారత్‌ సహా పలు దేశాల్లో వీటి సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆండ్రాయిడ్‌ తో పాటు ఐవోఎస్‌ వినియోగదారులూ ఇబ్బందులు  ఎదుర్కొన్నారు. సందేశాలు పంపించడానికి వీలు లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు.

ఆఫ్ఘాన్‌లో దారుణం... మహిళా వాలీబాల్ ప్లేయర్ తల నరికిన తాలిబన్లు... నిషేధం ఉన్నా వినకుండా...

ఫేస్ బుక్ లో తాజాగా తలెత్తిన అంతరాయం గంటల వ్యవధిలోనే ఆ సంస్థకు భారీ తెచ్చింది. అంతేకాదు, ఫేస్ బుక్ యజమాని Mark Zugerberg వ్యక్తిగత ఆదాయాన్నీ కోల్పోయి బిలియనీర్ల జాబితాలో దిగజారిపోయాడు. సుమారు ఏడు గంటలపాటు తలెత్తిన అంతరాయం కారణంగా ఫేస్‌ బుక్‌ సంస్థ భారీ నష్టాన్ని చవిచూసింది. 

దాదాపు 7 బిలియన్‌ డాలర్ల నష్టం వచ్చినట్లు బ్లూమ్స్ బర్గ్ తదితర సంస్థలు అంచనా వేశాయి. అంతేకాదు, ప్రపంచ వ్యాప్త అంతరాయం కారణంగా సోమవారం ఫేస్ బుక్ షేర్లు పడిపోవడంతో జుకర్‌బర్గ్‌ ర్యాంక్‌ బిల్‌ గేట్స్‌ కంటే దిగువకు పడిపోయింది. బ్లూమ్‌ బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌లో జుకర్ ఐదో స్థానానికి దిగాడు. సూచిక ప్రకారం.. వారాల వ్యవధిలో సుమారు 140 బిలియన్‌ డాలర్లను ఆయన నష్టపోయాడు.
 

Follow Us:
Download App:
  • android
  • ios