Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమానానికి ఎలన్ మస్క్ పేరు.. నామినేట్ చేసిన నార్వే ఎంపీ
ఎలన్ మస్క్ పేరును నోబెల్ శాంతి బహుమానం కోసం నామినేట్ చేశారు. నార్వే ఎంపీ మేరియస్ నిల్సెన్ నామినేట్ చేశారు. వాక్ స్వాతంత్ర్యం కోసం మస్క్ పాటుపడుతున్నారని వివరించారు.
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్ పేరు మీద నోబెల్ శాంతి బహుమానానికి నామినేషన్ వచ్చింది. నార్వే ఎంపీ ఈ నామినేషన్ పంపారు. భావప్రకటన స్వేచ్ఛకు, రష్యా ఆక్రమణ తర్వాత ఉక్రెయిన్ వాసులు మిగిలిన ప్రపంచంతో అనుసంధానం కావడానికి ఎలన్ మస్క్ చేసిన కృషిని నార్వే ఎంపీ మేరియస్ నిల్సెన్ ప్రస్తావించారు. నార్వేలోని లిబర్టేరియన్ ఎంపీ నీల్సెసన్ నామినేషన్ వేశారు. ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమణను అడ్డుకోవడానికి పోరాడుతున్న యోధులు కమ్యూనికేట్, కోఆర్డినేట్ చేసుకోవడానికి, రష్యాను ఎదుర్కోవడానికి ఎలన్ మస్క్ స్టార్ లింక్ ఎంతో ఉపకరించిందని ఆయన వివరించారు.
ఎలన్ మస్క్ స్థాపించిన, నడుపుతున్న సంస్థలు సమాజాన్ని మరింత ఉన్నతంగా మార్చడానికి, భూమి, అంతరిక్షం గురించి ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయని నీల్సెన్ విరవించారు. అంతర్జాతీయంగా కమ్యూనికేట్ కావడనికి ఉపకరిస్తున్నాయని తెలిపారు. ప్రపంచం ఒకరితో మరొకరు సంభాషించుకోవడానికి, అనుసంధానంలో రావడానికి, ఈ ప్రపంచమే ఒక భద్రమైన ప్రాంతంగా ఉండటానికి ఎలన్ మస్క్ సేవలు దోహదపడుతున్నాయని వివరించారు.
Also Read : VPR: వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి ఎందుకు రాజీనామా చేశారు? ఆయన అడుగులు ఎటువైపు ?
నోబెల్ శాంతి బహుమానానికి ఎలన్ మస్క్ నామినేషన్‌ను సమర్థిస్తూ మనిషి భిన్న అభిప్రాయాలు, చర్చలు, విమర్శనాత్మక ఆలోచనలు, పరస్పరం భిన్నమైన అభిప్రాయాలు సంఘర్షించడం ద్వారా పరిణతి చెందుతారని నార్వే ఎంపీ నీల్సెన్ తెలిపారు. ఇందుకు ఎలన్ మస్క్ సంస్థలు సహకరిస్తున్నాయని వివరించారు.