మార్నింగ్ జాగింగ్ టైంలో కిడ్నాప్‌కు గురైన.. 34 ఏళ్ల మహిళ హత్యకు గురైంది. మృతురాలు 3 బిలియన్లకు పైగా విలువైన హార్డ్‌వేర్ కంపెనీ వారసురాలు ఎలిజా ఫ్లెచర్‌గా పోలీసులు గుర్తించారు.
అమెరికా : ఆమె ఓ కోటీశ్వరుడు కూతురు…రోజు ఉదయాన్నే జాగింగ్ కు వెళ్లడం అలవాటు.. వృత్తిరీత్యా టీచర్.. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉంటూ ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తిత్వం. అలాంటి మహిళ ఓ రోజు జాగింగ్ కి వెళ్లి మృత్యువాత పడింది. ఆమెను ఓ కరుడుగట్టిన నేరస్థుడు తల మీద కాల్చి చంపేశాడు. ఆమెకు.. అతనికి.. అంతకుముందు పరిచయమూ లేదు.. ఎలాంటి శత్రుత్వమూ లేదు.. ఆమె పేరు ఎలిజా ఫ్లేచర్ (34).
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఎలిజా ఫ్లెచర్ తండ్రి కోటీశ్వరుడు. అమెరికాలోని టెన్నిసీ నగరం వీరి నివాసం. ఎలిజా ఫ్లెచర్ గా తన విధిని చక్కగా నిర్వహిస్తుంది. మంచి తల్లిగా పేరుతెచ్చకుంది. చేతినిండా కావలసినంత డబ్బు.. ఎలాంటి చీకూ చింతాలేని జీవితం. కానీ మార్నింగ్ జాగింగ్ కు వెళ్లడం ఆమె జీవితంలో విషాదాన్ని నింపింది.
భార్యను లవర్ తో బెడ్ మీద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... ఏం చేశాడంటే..
ఆరోజు ఉదయం కూడా.. రోజు లాగే రోడ్డు వెంట జాగింగ్ కు వెళ్ళింది. ప్లెచర్. ఈ క్రమంలోనే ఓ కరుడుగట్టిన నేరస్తుడు ఆమెకు ఎదురుగా వచ్చాడు. యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ దగ్గర ఆమె జాగింగ్ కు అడ్డుగా వచ్చాడు. ఆమెకు గన్ చూపించి దగ్గర్లో చీకటిగా ఉన్న కొండ ప్రాంతానికి లాక్కెళ్లాడు. ఆమె తల మీద గన్ పెట్టి కాల్చేశాడు. జాగింగ్ కు వెళ్లిన ప్లెజర్ ఎంతకీ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో.. వెతికిన పోలీసులకు ఓ కొండ ప్రాంతంలో ఆమె మృతదేహం దొరికింది.
వెంటనే పోస్టుమార్టం నిర్వహించగా బాధితురాలి తల వెనుక భాగంలో గన్ తో కాల్చడం వల్లే చనిపోయినట్లుగా తేలింది. ఈ హత్య వెలుగు చూసిన మరుసటి రోజే హంతకుడైన క్లియోథా అబ్ట్సన్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న సర్వేలెన్సు ఆధారంగా హంతకుడిని పట్టుకున్నారు. మీద దాడి జరిగిన ప్రాంతంలో నిందితుడి చెప్పుల జోడు ఆధారంగా.. డిఎన్ఏ రిపోర్టు ద్వారా అతనిని గుర్తించామని తెలిపారు.
ఈ ఘటన నిరుడు సెప్టెంబర్ 2న జరిగింది. దీని మీద ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. అన్యాయంగా ఓ మహిళ ప్రాణాలు తీసిన దోషికి మరణశిక్ష విధించాలని ఆమె తరఫు న్యాయవాది కోరుతున్నారు. బాధితురాలు మీద నేరస్థుడు వ్యవహరించిన తీరు అత్యంత హేయంగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, చట్టాన్ని అనుసరించి ఏ శిక్ష విధించాలో చూడాల్సి ఉంటుందని న్యాయమూర్తి అంటున్నారు. అబ్ట్సన్ కు గతంలో చాలా నేరచరిత్ర ఉంది. అతనిపై ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయి. రెండువేల సంవత్సరంలో ఓ మర్డర్ కేసులో అతను 20 ఏళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. 2021లో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్ట్సన్ తన మీద దాడి చేశాడని అలేసియా ఫ్రాంక్లిన్ అనే మహిళ ఆరోపించింది కూడా.
ఆమెను కూడా ఇలాగే గన్ తో బెదిరించి ఖాళీగా ఉండే అపార్ట్మెంట్ లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమె కళ్ళకు గంతలు కట్టి కారు వెనుక భాగంలో పడేశాడు. ఆమె మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిమీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆ సమయంలో ఈ కేసులో పోలీసులు సరిగా పట్టించుకోలేదని ఆరోపించారమే.
