భార్యను లవర్ తో బెడ్ మీద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త... ఏం చేశాడంటే..
ఓ వ్యక్తి తన భార్యను వేరే వ్యక్తితో తనింట్లో బెడ్ మీద కలిసి ఉండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. వెంటనే కోపంతో బ్యాట్ తో చితకబాది.. చంపడానికి ప్రయత్నించాడు.

అమెరికా : ఓ వ్యక్తి తన భార్య, ఆమె ప్రియుడితో కలిసి బెడ్రూంలో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీంతో తీవ్ర కోపంతో ఆ బాయ్ ప్రెండ్ తో అల్యూమినియం బ్యాట్ తో చితకబాదాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆ వ్యక్తి చావు దాకా వెళ్లాడు. వివరాల్లోకి వెడితే..
జాన్ డిమ్మిగ్ అనే వ్యక్తి.. ఇంటికి వచ్చేసరికి భార్య క్రిస్టీ బార్బటో.. ఆమె సహోద్యోగి, సిటి టెక్నీషియన్ అయిన వ్యక్తితో ఒకే మంచం మీద ఉండడం చూశాడు. వెంటనే డిమ్మిగ్ రూంలోకి వెళ్లి.. తలుపు మూసివేసి వ్యక్తిని కొట్టాడు.
బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం... తనను కొట్టి, నేలపైకి తోసేసి.. బ్యాట్ తో తీవ్రంగా కొట్టాడు. మెటల్ వస్తువుతో కనీసం మూడు సార్లు కొట్టాడని కూడా ఆరోపించాడు.
సీసీ టీవీ ఫుటేజీలో డిమ్మింగ్ బ్యాట్‌తో ఆ ప్రాంతానికి రావడం కనిపించింది. తరువాత, భర్త అటాక్ చేస్తుండగా... బార్బాటో తన భర్తను ప్రియుడినుంచి దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తూ, "జాన్! ఆపు! అతనికి రక్తస్రావం అవుతుంది" అని ఆపే ప్రయత్నం చేసింది.
ఆ తరువాత మరోసారి తన భార్యను కలవొద్దని డిమ్మిగ్ ఆ వ్యక్తిని బెదిరించాడు. బార్బటో అడ్డుపడకుంటే డిమ్మింగ్ తనను చంపేవాడని అతను వాపోయాడు. మహిళ తన సహోద్యోగి..పని తర్వాత డ్రింక్స్ కోసం బయటకు వెళ్లామని అతను అంగీకరించాడు.
దాడి తరువాత బార్బటో పోలీసులను పిలిచి తన సహోద్యోగిమీద భర్త దాడి చేసిన విషయం రిపోర్ట్ చేసింది. ఈ దారుణమైన దాడికి పాల్పడింది తన భర్తేనని ఆ మహిళ చెప్పడంతో పోలీసులు మిస్టర్ డిమ్మిగ్‌ను విచారించారు. అతను రోజంతా వారి లేక్ పార్క్ లోని ఇంటిని వదిలి వెళ్ళలేదని చెప్పాడు.
మధ్యలో ఓ సారి కిరాణషాపుకు వెళ్లివచ్చానంతే అని చెప్పాడు. అయితే తన దగ్గర బ్యాట్‌ను ఉన్నట్లు అంగీకరించాడు, కానీ, దానిని ఎవరినీ కొట్టడానికి ఉపయోగించలేదని చెప్పాడు.
ఈ విషయంపై సరైన విచారణ తర్వాత, పోలీసులు దంపతుల ఇంట్లోని లాండ్రీ గదిలో "చిన్న వెంట్రుకలు" ఉన్న బ్యాట్‌ను కనుగొన్నారు. రక్తపు మరకలతో ఉన్న నల్లటి టీ షర్ట్, తెల్లటి అండర్ షర్టు కూడా దొరికింది. దీంతో డిమ్మిగ్‌పై "హత్య ప్రయత్నం, ప్రాణాంతకమైన ఆయుధంతో దాడి చేయడం" వంటి అభియోగాలు మోపారు.