ఇండోనేషియాలో భారీ భూకంపం.. తప్పిన సునామీ ప్రమాదం...
ఇండోనేషియాలోని బండా సముద్రంలో బుధవారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తరువాత రాత్రి మరో భూకంపం 6.7 తీవ్రతతో మరో భూకంపం వణికించింది.
ఇండోనేషియా : ఆగ్నేయ ఆసియా ద్వీపదేశమైన ఇండోనేషియాను భారీ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 6.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఇప్పటివరకు నమోదు కాలేదు. ఇండోనేషియాలోని భాండా సముద్ర ప్రాంతంలో బుధవారం రాత్రి 8.2నిమిషాలకు మరోసారి శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 6.7 గా ఉన్నట్లు యూఎస్ జియో లాజికల్ సర్వే సర్వే తెలిపింది. బండా సముద్రంలో వచ్చిన ఈ భూకంపంతో ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.
ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని ఇండోనేషియా అధికారులు తెలుపుతున్నారు. దానికంటే ముందు బుధవారం ఉదయం 11:53 నిమిషాలకు తనింబార్ దీవుల్లోని సౌమ్లాకి పట్టణంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత చాలా అధికంగా ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేశారు. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండే ఇండోనేషియా ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.
భగవద్గీత అశ్లీలమైనది, అసహ్యకరమైనదట .. స్లోవేనియన్ తత్వవేత్త సంచలన వ్యాఖ్యలు
భూ అంతర్భాగంలో ఉండే టెక్ట్రానిక్ ప్లేట్ల కదలిక వల్ల ఈ భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ కదలికలు ఇండోనేషియా ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇండోనేషియా ప్రాంతంలో ఉండే సముద్రంలో భారీ అగ్నిపర్వతాలు తరచుగా విస్పోటనం బారిన పడుతుంటాయి. ఈ రెండు కారణాలతోనే ఇండోనేషియా ప్రాంతంలో భూకంపాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జపాన్ నుంచి ఆగ్నేయసియా, పసిఫిక్ బేసిక్ మీదుగా విస్తరించి ఉంది.
ఈ కారణంగానే 2004లో 9.1 తీవ్రతతో సుమాత్రా తీరంలో భారీ భూకంపం వచ్చింది. ఇంత భారీ స్థాయిలో ఏర్పడిన భూకంపం వల్ల ఆ సమయంలో సునామీ ఏర్పడింది. దీంతో భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలిగింది. ఒక్క ఇండోనేషియాలోనే 1,70,000 మంది చనిపోగా, పొరుగున ఉన్న శ్రీలంక, ఇండియాలలో కలిసి రెండు లక్షల ఇరవై వేలమంది చనిపోయారు.