భగవద్గీత అశ్లీలమైనది, అసహ్యకరమైనదట .. స్లోవేనియన్ తత్వవేత్త సంచలన వ్యాఖ్యలు
భారతీయుల పవిత్ర గ్రంథం, హిందూ తత్వశాస్త్రంలో అత్యంత పురాతనమైన భగవద్గీతపై ప్రఖ్యాత స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ జిజెక్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ గ్రంథం అత్యంత అసభ్యకరమైన, అసహ్యకరమైన పవిత్ర పుస్తకాలలో ఒకటిగా వ్యాఖ్యానించాడు .
భారతీయుల పవిత్ర గ్రంథం, హిందూ తత్వశాస్త్రంలో అత్యంత పురాతనమైన భగవద్గీతపై మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక భిన్నవాదనలు వున్నాయి. అయితే ప్రఖ్యాత స్లోవేనియన్ తత్వవేత్త స్లావోజ్ జిజెక్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈ పవిత్ర గ్రంథాన్ని అర్ధం చేసుకోవడంపై తీవ్ర చర్చలు, ఆందోళనలను రేకెత్తించింది. గతంలో @YearOfTheKraken అనే వ్యక్తి షేర్ చేసిన వీడియోలో.. జిజెక్ భగవద్గీతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ గ్రంథం అత్యంత అసభ్యకరమైన, అసహ్యకరమైన పవిత్ర పుస్తకాలలో ఒకటిగా వ్యాఖ్యానించాడు. జర్మనీకి చెందిన నాజీ రాజకీయ నాయకుడు హెన్రిచ్ హిమ్లెర్ యూదులపై జరిగిన మారణహోమాన్ని సమర్ధించడానికి భగవద్గీతను ఉపయోగించాడని జిజెక్ గుర్తుచేశాడు.
భగవద్గీత అనేది 700 శ్లోకాలతో కూడిన హిందూ పవిత్ర గ్రంథం. దాని తాత్విక లోతు, ఆధ్యాత్మిక బోధనలకు సర్వత్రా గౌరవం దక్కుతోంది. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా వున్న శ్రీకృష్ణుడు.. కర్తవ్యం, ధర్మం, జీవిత స్వభావాలపై మార్గనిర్దేశం చేస్తాడు . అదే భగవద్గీత. దీని ఇతివృత్తాలు ధర్మం, విధి, నైతిక సందిగ్థతలు, ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి మార్గం చుట్టూ తిరుగుతాయి.
ఇటీవల విడుదలైన ప్రఖ్యాత హాలీవుడ్ చలనచిత్రం ‘ఓపెన్‌హైమర్’’ లోని ఒక సన్నివేశాన్ని ఉదహరిస్తూ జిజెక్ విమర్శలు చేశాడు. ఈ చిత్రంలోని పాత్రలు భగవద్గీత చదువుతుండగా లైంగిక చర్యలో పాల్గొంటాయి. ఆయన దీనిని వైరుధ్యంగా వర్ణించాడు. అశ్లీలమైన, అసహ్యకరమైన వచన సారాంశాలతో అందమైన లైంగిక చర్యని చిత్రీంచాడు. ఓపెన్‌హైమర్ మంచి చిత్రమని.. రాజకీయ భాగం ముఖ్యంగా కమిటీకి వారు చూపించిన విధానం, ఓపెన్‌హైమర్‌ను తారుమారు చేశారు. కానీ భగవద్గీతలోని ఆధ్యాత్మిక భాగాన్ని తాను ద్వేషిస్తున్నానని జిజెక్ ఎక్స్‌లో షేర్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు.
‘‘ భారతదేశంలో ఓపెన్‌హైమర్ ఒక కుంభకోణానికి కారణమైంది. ఫ్లోరెన్స్ పగ్, ఓపెన్‌హైమర్ తొలిసారి ప్రేమించుకున్నప్పుడు.. భగవద్గీత చదవమని ఆమె అతనిని మరోక విధంగా అడుగుతుందని తనకు తెలియదని భావిస్తున్నాను. అయితే దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. డర్టీ, సెక్స్ యాక్ట్.. ఎలా అన్న భారతీయుల వాదనతో నేను ఏకీభవిస్తున్నాను. కానీ ఒక అందమైన లైంగిక చర్యను అత్యంత అశ్లీలమైన, అసహ్యకరమైన పవిత్ర పుస్తకాలలోని కొంత భాగాన్ని చదవడం ద్వారా పాడుచేస్తారు’’ అంటూ జిజెక్ వ్యాఖ్యానించాడు.
అక్కడితో ఆయన ఆగలేదు.. భగవద్గీత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నాటి నాజీ పాలనలోని ప్రముఖ వ్యక్తి హెన్రిచ్ హిమ్లెర్ వ్యాఖ్యలతో కలిపి ఖండించాడు. స్లోవేనియన్ తత్వవేత్త ప్రకారం.. యూదుల హత్యాఖండకు నైతిక సమర్ధనగా హిమ్లెర్ భగవద్గీతను ప్రస్తావించారని జిజెక్ ఆరోపించారు. మానత్వాన్ని కోల్పోకుండా హేయమైన చర్యలకు పాల్పడే ప్రశ్నకు సమాధానంగా దీనిని రూపొందించారని ఆయన వ్యాఖ్యానించారు. భగవద్గీతను హెన్రిచ్ హిమ్లెర్ ఎల్లవేళలా తన జేబులో వుంచుకునేవాడని.. ఎందుకంటే ఇది యూదులను ఎలా చంపాలనే దానిపై అతనికి సమాధానంగా ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘‘మనం భయంకరమైన పనులు చేస్తున్నాము.. యూదు పిల్లలను , ఇతరులను చంపుతున్నాం, మనమే మృగాలుగా మారకుండా ఎలా చేయగలం .. వీటికి అతని సమాధానం భగవద్గీత ’’ అని జిజెక్ పేర్కొన్నారు.
ఈ సంఘం చాలా వివాదాస్పదమైనది. ఇక్కడ ప్రాథమిక అపార్ధం లేదా తప్పుడు వివరణ ఉంది. భగవద్గీత, ఆధ్యాత్మిక, తాత్విక మార్గదర్శి, కర్మ ఫలాల పట్ల అటాచ్మెంట్. ఒకరి కర్తవ్యాన్ని నెరవేర్చడం , ప్రాముఖ్యత, ఉనికి దాని సంక్లిష్టతలను అర్ధం చేసుకోవడం గురించి బోధిస్తుంది. భగవద్గీత హింసను, హోలోకాస్ట్‌ను వివరించే అమానవీయ చర్యలను ఆమోదించదు. శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక సాంత్వన, నైతిక జ్ఞానం, తాత్విక అంతర్దృష్టిని కోరుకునే వ్యక్తులకు భగవద్గీత మార్గదర్శకంగా వుంది. దాని బోధనలు.. సంస్కృతులు, తరాలుగా ప్రతిధ్వనించాయి. స్వీయ సాక్షాత్కారం, కర్తవ్యం, అంతర్గత శాంతి సాధన ప్రాముఖ్యతను భగవద్గీత నొక్కి చెప్పింది.