అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) భూమి పరిమాణంలో ఉన్న మరో గ్రహాన్ని గుర్తించింది. సోమవారం హోనలూలులోని అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ నిర్వహించిన వార్షిక సమావేశంలో నాసా అస్ట్రో ఫిజిక్స్ విభాగం డైరెక్టర్ పాల్ హెర్ట్జ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమకు చెందిన ప్లానెట్ హంటర్ శాటిలైట్ టీఈఎస్ఎస్ నక్షత్ర మండలానికి సమీపంలో భూమి పరిమాణంలో ఉన్న గ్రహాన్ని కనుగొందని, ఇక్కడ నీటి జాడలు ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

Also Read:టిక్ టాక్ ఆర్టిస్ట్ తో లింక్: టీవీ యాంకర్ కొట్టిన మంత్రి

దీనికి టీఓఐ 700 డీ అని నామకరణం చేశామని.. ఇది భూమికి 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు హెర్ట్జ్‌ తెలిపారు. టీఈఎస్ఎస్‌ను నక్షత్ర కక్ష్యలో ఉన్న భూమిని పోలిన గ్రహాలను కనుగొనేందుకు రూపొందించారు.

అయితే టీఈఎస్ఎస్ తొలుత దీనిని నక్షత్రంగా గుర్తించింది. అయితే టీఈఎస్ఎస్ సభ్యులతో కలిసి పనిచేసే హైస్కూలు విద్యార్ధి ఆల్టన్ స్పెన్సర్ ఈ తప్పును గుర్తించి శాస్త్రవేత్తలకు తెలియజేశాడు. అనంతరం స్పట్జర్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో సదరు గ్రహాన్ని గుర్తించారు.

Also Read:ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట: 35 మంది మృతి

గతంలోనూ ఇలాంటి మరికొన్ని గ్రహాలు కనగొనబడగా.. టీఈఎస్ఎస్ కనుగొనడం ఇదే మొదటిసారి. విశ్వంలోని వస్తువులు, గ్రహాలు, నక్షత్రాలు ముందు వెళుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఆకాశంలోని స్థిరకక్ష్యలో టీఈఎస్ఎస్ సంచరిస్తుంది.