ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో తొక్కిసలాట: 35 మంది మృతి
అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ అత్యున్నత సైనికాధికారి ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. తమ అభిమాన నేత, ఆరాధ్య దైవం అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు రోడ్లమీదకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
![35 killed in stampede at funeral of general qassem soleimani 35 killed in stampede at funeral of general qassem soleimani](https://static-gi.asianetnews.com/images/01dxzswsnwks1jhgtzt1jantb1/sulemani-jpg_363x203xt.jpg)
అమెరికా డ్రోన్ దాడిలో మరణించిన ఇరాన్ అత్యున్నత సైనికాధికారి ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో అపశృతి చోటు చేసుకుంది. తమ అభిమాన నేత, ఆరాధ్య దైవం అంతిమయాత్రలో పాల్గొనేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు రోడ్లమీదకు రావడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయపడినట్లు ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. కాగా సులేమానీ భౌతికకాయాన్ని మంగళవారం ఆయన సొంతగ్రామం కెర్మాన్‌కు తీసుకొచ్చారు.
Also Read:బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి... ఇరాన్ కీలక నేత హతం
దీంతో సులేమానీకి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోగా, జనం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు ఇరాన్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ చీఫ్ పీర్ హోస్సేన్ కౌలివంద్ పేర్కొన్నారు.
Also Read:బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి...ఇదంతా ట్రంప్ ప్లానే
కాగా శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాత్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధినేత ఖాసీం సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అగ్రనేత అయతోల్లా అలీ ఖమేనీ తర్వాత ఆ దేశంలో సులేమానీ అత్యంత శక్తివంతమైన నేత.
![left arrow](https://static-gi.asianetnews.com/v1/images/left-arrow.png)
![right arrow](https://static-gi.asianetnews.com/v1/images/right-arrow.png)