డ్రగ్స్‌కు బానిసైన ఓ యువకుడు తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించాడు. ఇలా వేధించవద్దని, తల్లిదండ్రులను కలవొద్దని, కేవలం ఫోన్‌లోనే మాట్లాడాలని కోర్టు ఆంక్షలు విధించింది. కానీ, ఈ ఆంక్షలనూ ఉల్లంఘించడంతో రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
న్యూఢిల్లీ: యూకేలో భారత సంతతికి చెందిన వ్యక్తి డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఆ డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బుల కోసం తప్పుదారి పట్టాడు. దొంగతనాలు చేశాడు. తల్లిదండ్రులకు టార్చర్ పెట్టాడు. డబ్బుల కోసం వారి రక్తం తాగాడు. తమ వద్ద ఉన్న డబ్బులన్నీ ఆ తల్లిదండ్రులు ఇచ్చేశారు. అయినా.. అతను ఆగలేదు. ఇంకా కావాలని వేధించాడు. డ్రగ్స్ మత్తులో ఏం చేస్తాడోననే భయంలో పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ డ్రగ్స్ బానిసకు యూకే కోర్టు శిక్ష విధించింది. జైలుకు పంపింది.
ఇంగ్లాండ్‌లోని మిడ్‌లాండ్స్ రీజియన్‌లో 49 ఏళ్ల దేవన్ పటేల్ డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించాడు. తమ వద్ద ఉన్న డబ్బులు అన్నీ కొడుక్కి ఇచ్చేశారు ఆ తల్లిదండ్రలు. అయినా.. విడిచిపెట్టలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు భయంతో పోలీసులను ఆశ్రయించారు. కోర్టు ఆ డ్రగ్స్ బానిసకు ఆంక్షలు విధించింది. తల్లిదండ్రులను కలవరాదని ఆదేశించింది. కేవలం టెలిఫోన్‌లో మాత్రమే వారిని కాంటాక్ట్ కావాలని సూచించింది.
ఆ తర్వాత కూడా టెలిఫోన్‌లో తల్లిదండ్రులను డబ్బుల కోసం వేధించాడు. ఫోన్‌లు తరుచూ చేస్తూ ఇబ్బంది పెట్టాడు. రోజులో పది సార్లు ఫోన్ చేస్తూ వేధించాడు. అయినా, ఫోన్ లిఫ్ట్ చేయకుంటే ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఇలా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడు.
Also Read: భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఇది 11వ వందే భారత్
దీనిపై కోర్టు స్పందించింది. తల్లిదండ్రులను నేరుగా కలువకుండా ఐదేళ్లపాటు ఆంక్షలు విధించింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
పటేల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, దేవన్ పటేల్ జీవితం డ్రగ్స్‌తో పాడు చేసుకున్నాడని అన్నారు. భవిష్యత్‌లో డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాడని వివరించారు.
