Trump on Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోలు దేశాలపై 100% సుంకాలను విధిస్తామనే తన ప్రకటనను ఖండించారు , తాను ఎప్పుడూ శాతాన్ని చెప్పలేదని , రష్యాతో సమావేశం నిర్వహించిన తర్వాత తదుపరి ఏమి జరుగుతుందో చూస్తానని అన్నారు.
Trump on Tariffs: భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తోందన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన మాటల్లో భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అయితే.. తాజాగా తిరిగి ప్రశ్నించే సరికి ట్రంప్ తన మాట మార్చారు. తాను అలా ఎప్పుడూ చెప్పలేదంటూ ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ జరిగిందంటే.. ?
రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న దేశాలపై అధిక సుంకాలు విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ బాంబు వేసిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా భారత్ ను టార్గెట్ చేస్తూ.. మాస్కోతో చమురు వాణిజ్యం చేస్తే దేశాలపై 100శాతం సుంకాలు (Trump Tariffs) విధిస్తానని హెచ్చరించారు. ఇలా రష్యాలో వ్యాపారం చేస్తున్న దేశాలపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్.
ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రష్యాతో అమెరికా, యూరప్ దేశాలు కూడా వ్యాపారం చేస్తున్నాయనీ, వాటి గురించి భారత్ ప్రశ్నించగా.. తాజాగా ఆ సుంకాల విషయంలో ట్రంప్ తన మాటను పూర్తిగా మార్చేశారు. ‘తాను ఎప్పుడూ సుంకాల శాతం చెప్పలేదు’ అన్నారు. తాజా వ్యాఖ్యలతో తన మునుపటి మాటలను కొంతవరకూ తేలికపరచే ప్రయత్నం చేశారు.
ఆ విషయం నాకు తెలియదు..
వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ‘నేను ఎప్పుడూ 100 శాతం చెప్పలేదు. కానీ టారిఫ్‌ల విషయమై మేము పరిశీలిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి. చాలా తక్కువ సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం. త్వరలోనే రష్యా ప్రతినిధులతో సమావేశం ఉంది. దానిలో ఏమి జరుగుతుందో మనం చూడాలి,’’అని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రష్యాతో అమెరికా వాణిజ్యం చేస్తోందంటూ భారత్ చేసిన వాదనల ఆధారంగా మాస్కో నుంచి వాషింగ్టన్ యురేనియం, ఎరువులు దిగుమతి చేసుకుంటోందా? అని మీడియా ట్రంప్‌ను ప్రశ్నించింది. దీనికి అధ్యక్షుడు బదులిస్తూ.. ఆ విషయం నాకు తెలియదు. తెలుసుకోవాలి. దాని గురించి త్వరలోనే వివరిస్తానని పేర్కొన్నారు.
భారత్‌కు పరోక్ష హెచ్చరికలు
ఇప్పటికే అమెరికా భారత్‌పై 25 శాతం చమురు దిగుమతుల సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘రష్యా నుంచి చమురు కొనడం ద్వారా వారు యుద్ధ యంత్రానికి ఇంధనం అందిస్తున్నారు. ఇది నాకు అసహనంగా ఉంది. కాబట్టి, ఇంకా ఎక్కువగా సుంకాలు విధించాల్సిన అవసరం ఉంటుంది,’ అని అన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్‌పై మరింత ఒత్తిడి తీసుకురావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారత్‌ను టార్గెట్ చేయొద్దు: నిక్కీ హేలీ హెచ్చరిక
మరోవైపు అమెరికా మాజీ రాయబారి, అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న నిక్కీ హేలీ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. చైనా వంటి దేశాలకు సుంకాల్లో మినహాయింపులు ఇస్తూనే.. భారత్‌పై ఆంక్షలు విధించడం సరి కాదు. భారత్‌ను టార్గెట్ చేయడం వల్ల అమెరికాకే నష్టమే. అది బలమైన మిత్రదేశ భారత్ తో స్నేహ బంధాన్ని బలహీన పర్చుకోవడమేనని హేలీ పేర్కొన్నారు. చైనా ప్రస్తుతం రష్యా, ఇరాన్ చమురు దిగుమతుల్లో నంబర్ వన్ దేశంగా నిలిచిందని, అయినప్పటికీ అమెరికా చైనాకు 90 రోజుల టారిఫ్ బ్రేక్ ఇచ్చినట్లు గుర్తు చేశారు.
