అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియా పన్నుల విధానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తమకు ఇండియా తలొగ్గింది అనేలా ఆయన మాట్లాడారు. మరి ఆయన మాటల్లో నిజమెంత?     

India-US Trade deficit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇండియా మీద పెద్ద మొత్తంలో టారిఫ్‌లు వేస్తోందని ఆరోపించారు. ఇండియా మా వస్తువులపై భారీ టారిఫ్‌లు వేసి వ్యాపారం చేయడం కష్టంగా మారుస్తోందని ట్రంప్ అన్నారు. అక్కడ అమెరికన్ వస్తువులు అమ్మడం చాలా కష్టం అంటూ ఆరోపణలు చేస్తూనే, ఇండియా ఇప్పుడు తన టారిఫ్‌లను తగ్గించడానికి సిద్ధంగా ఉందని కూడా ఆయన అన్నారు.

ఇండియా టారిఫ్ తగ్గించడానికి రెడీ

వైట్ హౌస్ (White House)లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ... ఇండియా అమెరికా వస్తువులపై భారీ టారిఫ్‌లు వేస్తోందన్నారు. ఇలా అత్యధిక పన్నుల కారణంగా అమెరికా అక్కడ ఏమీ అమ్మలేకపోతోందన్నారు. కానీ ఇప్పుడు భారత్ పద్దతి మార్చుకుంది... పన్నులు తగ్గించుకోడాలనికి ఒప్పుకున్నారన్నారు. వాళ్ళని ఎక్స్‌పోజ్ చేయడంవల్వాలే టారిఫ్‌లను బాగా తగ్గించాలని అనుకుంటున్నారని ట్రంప్ పేర్కొన్నారు. 

అమెరికా మీద దశాబ్దాలుగా భారీ టారిఫ్‌లు వేస్తున్నారు... ఇప్పుడు మన వంతు వచ్చిందన్నారు. ఏప్రిల్ 2025 నుంచి 'రెసిప్రొకల్ టారిఫ్స్' అమలు చేస్తామని ట్రంప్ క్లియర్ చేశారు. కంటికి కన్ను, టారిఫ్‌కు టారిఫ్... అదే తమ విధానం అనేలా ట్రంప్ కామెంట్స్ చేసారు. 

ఇండియా 100% ఆటో టారిఫ్స్

అమెరికన్ కాంగ్రెస్‌ను (US Congress) ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ... ఇండియా, చైనా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, మెక్సికో, కెనడా అమెరికాపై చాలా ఎక్కువ టారిఫ్‌లు వేస్తున్నాయని... ఇది చాలా అన్యాయం అన్నారు. ప్రత్యేకంగా ఇండియా గురించి మాట్లాడుతూ, ఇండియా మనపై 100% కంటే ఎక్కువ ఆటో టారిఫ్‌లు వేస్తోందని చెప్పారు.

గత నెలలో వైట్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ఇలా అన్నారు: టారిఫ్‌ల విషయంలో ఇండియా చాలా స్ట్రిక్ట్‌గా ఉంది. ఇండియాలో వస్తువులు అమ్మడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకి ట్రేడ్ బ్యారియర్స్ (Trade Barriers) ఉన్నాయి, ఇంకా చాలా స్ట్రాంగ్ టారిఫ్‌లు ఉన్నాయి.

యూఎస్-ఇండియా ట్రేడ్‌పై వచ్చిన రిపోర్ట్ ప్రకారం.. 2024లో ఇండియాతో అమెరికా మొత్తం వ్యాపారం 129.2 బిలియన్ డాలర్లు. అమెరికన్ వస్తువుల ఎగుమతి ఇండియాలో 41.8 బిలియన్ డాలర్లు కాగా, అమెరికా ట్రేడ్ గ్యాప్ (Trade Deficit) 45.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది 2023తో పోలిస్తే 5.4% ఎక్కువ.