ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ తో ముందుగా అనుకున్నట్లు జూన్ 12 సమావేశం జరగకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
వాషింగ్టన్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ తో ముందుగా అనుకున్నట్లు జూన్ 12 సమావేశం జరగకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా సమావేశం ఉండవచ్చునని అన్నారు.
అణ్వాయుధాలను వదిలేయడానికి ఉత్తర కొరియా నిరాకరించడంతో కిమ్ తో భేటీకి ట్రంప్ నిరాకరిస్తున్నారు. అణ్వాయుధాలను పూర్తిగా వదిలివేయాలని అమెరికా నుంచి ఏకపక్షంగా ఒత్తిడి వస్తే ట్రంప్‌తో సమావేశం రద్దు చేసుకుంటామని ఉత్తరకొరియా ఇటీవల స్పష్టం చేసింది.
కిమ్ తో భేటీ ఉండకపోవచ్చునంటే పూర్తిగా కాదని, జూన్ 12వ తేదీన మాత్రం కాదని, ఆ తర్వాత ఉండే అవకాశం లేకపోలేదని ట్రంప్ అన్నారు. ఉత్తర కొరియాకు ఇది మంచి అవకాశమని, దాన్ని వాడుకోవాలని అన్నారు.
