కరోనా కోరలు పీకేందుకు.. రంగంలోకి శునకాలు
కుక్కల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు బ్రిటన్, అమెరికాలోకి కుక్కలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని ‘‘ ది వాషింగ్టన్ పోస్ట్’’ ప్రచురించింది
ఏ వ్యాధికైనా చికిత్స అందించాలంటే దాని నిర్ధారణ అత్యవసరం. కరోనా వైరస్‌కైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. కోవిడ్ 19ను టెస్టింగ్ చేసేందుకు ప్రపంచం కిందా మీదా పడుతోంది. మనదేశం విషయానికే వస్తే రక్త నమూనాలు ల్యాబ్‌కు పంపించి ఫలితం రావడానికి 48 గంటల సమయం పడుతుంది.
చైనా నుంచి కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల పనితీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుక్కల ద్వారా కరోనాను పసిగట్టొచ్చంటున్నారు నిపుణులు. ఈ మేరకు బ్రిటన్, అమెరికాలోకి కుక్కలకు ఇప్పటికే శిక్షణ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
Also Read:గుడ్‌న్యూస్: ఆశలు కల్గిస్తున్న రెమెడిసివిర్ డ్రగ్, కోలుకొంటున్న కరోనా రోగులు
లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్‌లోనూ ఇలాంటి పరిశోధనలే జరుగుతున్నాయని ‘‘ ది వాషింగ్టన్ పోస్ట్’’ ప్రచురించింది. మనిషిలో ఉండే మలేరియా ఇన్ఫెక్షన్లను కుక్కలు పసిగట్టవలని ఆ సంస్థ పరిశోధకులు గతంలో ధ్రువీకరించారు.
దీంతో దీనిపై దృష్టి సారించారు నిపుణులు. కోవిడ్ 19ను కనుక జాగిలాలు పసిగట్టగలిగితే ఎయిర్ పోర్ట్స్, హాస్పిటల్స్, ఇతర వ్యాపార ప్రాంతాల్లోనూ స్క్రీనింగ్ చేసేందుకు వీటిని ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read:పిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు.. చాలా ప్రమాదకరంగా.
కుక్కల్ని ఇప్పటికే పేలుడు పదార్థాలు, డ్రగ్స్, నిషేధిత ఆహార పదార్థాలతో పాటు మలేరియా, క్యాన్సర్‌ను పసిగడుతున్నందున కోవిడ్‌ను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక్కో వైరస్‌కు ప్రత్యేక వాసన ఉంటుందని... అందువల్ల కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి, వైరస్‌ను కనిపెడితే ఒక్కో జాగీలం 250 మందిని స్క్రీనింగ్ చేయగలదని లండస్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ పరిశోధకులు చెబుతున్నారు.