వాషింగ్టన్: రెమెడిసివిర్ డ్రగ్ ద్వారా కరోనా రోగులు త్వరగా కోలుకొంటున్నారని అమెరికా ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ ఇన్పెక్షియస్ డీజీజెస్ డైరెక్టర్ ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ ఆంథోని ఫౌసీ తెలిపారు.

తక్కువ సమయంలో అతి వేగంగా కరోనా వైరస్ రోగులు రెమెడిసివిర్ డ్రగ్ ద్వారా కోలుకొన్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు తమ ప్రయోగాల్లో తేలిందని అమెరికా ప్రకటించింది. ప్రయోగాత్మక ఔషదం రెమెడిసివిర్ ద్వారా రోగులు కోలుకోవడానికి నాలుగు రోజుల కంటె తక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అధ్యయనం తేల్చిందని అమెరికా ప్రకటించింది.

కరోనా వైరస్ ను కట్టడిచేసేందుకు  గిలియడ్ సైన్సెస్ కు చెందిన రెమెడిసివిర్ కీలక విజయాన్నిసాధించిందని నిపుణులు చెబుతున్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ అందుబాటులోకి తేవడానికి ఏడాది  లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ఆరోగ్య శాఖాధికారులు అభిప్రాయంతో ఉన్నారు.

also read:కోతులపై కరోనా వ్యాక్సిన్ సక్సెస్: వ్యాక్సిన్ తయారీకి పుణె సీరం ఇనిస్టిట్యూట్ రెడీ...

కరోనా రోగులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా 68 ప్రాంతాల్లోని  1,063 మంది ఆసుపత్రుల్లో రోగులకు యాంటీ వైరల్ డ్రగ్ రెమెడిసివిర్ ఇచ్చారు. ఈ డ్రగ్ మంచి ఫలితాలను ఇచ్చిందని ఆంథోని వెల్లడించారు. రోగులు కోలుకొనే సమయం తగ్గిందన్నారు. ఈ డ్రగ్ తీసుకొన్న రోగులు 11 రోజుల్లో కోలుకొన్నారని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ డ్రగ్ తీసుకొన్న రోగుల్లో మరణాల సంఖ్య కూడ తగ్గుముఖం పట్టిందన్నారు.

పూర్తి ఫలితాలను మెడికల్ జర్నల్‌లో త్వరలోనే ప్రచురిస్తామని ఫౌసీ చెప్పారు. రెమెడిసివిర్ ఔషధంతో కరోనాకు చెక్ పెట్టవచ్చని ఫౌసీ ధీమా వ్యక్తం చేశారు.
కరోనావైరస్ నిరోధానికి ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న పరీక్షిస్తున్న అనేక చికిత్సలలో గిలియడ్‌కు చెందిన రెమెడిసివిర్ ఒకటి.

 దీన్ని ఇప్పటికే  చైనాలో ఉపయోగించినా, ఫలితాలు పెద్దగా ఆశాజనంగా లేవని గతంలో అధ్యయనాలు తెలిపాయి. అలాగే గిలియడ్ మొదట ఎబోలాకు మందుగా రెబోడెసివిర్‌ను అభివృద్ధి చేసింది. కానీ ఆమోదానికి నోచుకోలేదు.